ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో
గుండె సంబంధిత సమస్యలు ప్రధానమైనదిగా చెప్పవచ్చు.ఈ సమస్యకు ప్రధాన కారణాలు
శరీరానికి అవసరమైన వ్యాయామం లేకపోవడం ఒకే చోట కూర్చుని ఎక్కువసేపు పనిచేయడం, మానసిక ఒత్తిడి,సిగరెట్,మద్యపానం, మారిన ఆహారపు అలవాట్లు వంటివి ప్రధానంగా చెప్పవచ్చు.

మనం సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవనం గడపడానికి పోషక విలువలతో కూడిన ఆహారం ఎంత అవసరమో అంతే శారీరక శ్రమ అవసరమవుతుంది.తగిన శారీరకశ్రమ లేకపోతే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి గుండె సంబంధిత వ్యాధులకు దారితీయవచ్చు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా కొన్ని రకాల వ్యాయామాలు చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.
గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడేవారికి నడక ఉత్తమమైన వ్యాయామంగా చెప్పవచ్చు. అయితే ఒకేసారి ఎక్కువసేపు నడవకుండా స్టాప్ అండ్ గో స్టైల్ వాకింగ్ చేయడంవల్ల మంచి ఫలితం ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం ఉన్నవారికి మానసిక ప్రశాంతత ఎంతో అవసరం అందువల్ల వీరు క్రమం తప్పకుండా యోగా చేయడం ఉత్తమం.
గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు ఇబ్బంది లేనంతవరకు మెట్లు ఎక్కడాన్ని
ప్రతిరోజు పాటించవచ్చు. ఈత కొట్టడం ద్వారా రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది తద్వారా గుండె సంబంధిత వ్యాధులు అదుపులో ఉంటాయి. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు మొదట వైద్యుల్ని సంప్రదించి తగిన సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం.
































