Thaman -Nithyamenon: ఇండియన్ ఐడల్ కార్యక్రమానికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ కార్యక్రమానికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆధారంగా ఈ కార్యక్రమాన్ని ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సింగర్ కార్తీక్, హీరోయిన్ నిత్యామీనన్, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇక ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా సింగర్ శ్రావణ భార్గవితో కలిసి కంటెస్టెంట్స్ మారుతి ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు అనే పాటను పాడారు. ఇక వీరి ఫర్ఫార్మెన్స్ గాను నిత్యమీనన్ సింగర్ కార్తికేయ మంచి మార్కులు వేశారు.

ఇక నిత్యామీనన్ వాదనతో తన ఫర్ఫార్మెన్స్ చెత్తగా ఉందని జడ్జిమెంట్ ఇచ్చారు. ఇండియన్ ఐడల్ లో మారుతి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇదేనని సింగర్ కార్తీక్ జడ్జిమెంట్ ఇవ్వగా, ఇండియన్ ఐడల్ లో మోస్ట్ వరెస్ట్ ఫర్ఫార్మెన్స్ ఇదేనని తమన్ జడ్జ్ మెంట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే నిత్యామీనన్ తమన్ మధ్య వివాదం చెలరేగింది.
ప్రోమో కోసమే గొడవ పడ్డారా…
ఇక తమన్ మాట్లాడుతూ నీకు కాన్ఫిడెన్స్ నచ్చింది కానీ నీ పర్ఫామెన్స్ ముఖ్యంగా నీ వాయిస్ ఏ మాత్రం బాగలేదని తమన్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. మొత్తానికి ఈ కార్యక్రమంలో తమన్, నిత్య మీనన్ మధ్య మాటల యుద్ధం నడిచింది.అయితే కేవలం ప్రోమో కోసమే ఇలా ఎడిట్ చేశారా లేకపోతే నిజంగానే వీరు గొడవ పడ్డారా అనే విషయం తెలియాల్సి ఉంది.































