తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళా ఖాతంలో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో అది బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం మే 30 నుంచి జూన్ 3వరకు ఉండనుందని అండమాన్ నికోబార్ దీవులవైపు ప్రయాణించే అవకాశం ఉందని వివరించింది. ఈ ప్రభావంతో నేడు, రేపు తెలంగాణాలో తేలికపాటి వర్షాలు పడతాయని, కోస్తా, రాయలసీమల్లో పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు అధికారులు
































