Hero Rana: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబాలలో దగ్గుబాటి కుటుంబం ఒకటి.రామానాయుడు వారసులుగా వెంకటేష్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెటుగా సురేష్ బాబు నిర్మాతగా ఇండస్ట్రీలో తమకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక సురేష్ బాబు వారసుడిగా రానా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పెద్ద ఎత్తున సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇకపోతే తాజాగా సురేష్ బాబు కుటుంబ సభ్యులు మొత్తం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్టు తెలుస్తుంది. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో రానా తల్లిదండ్రులతో పాటు ఆయన భార్య సోదరుడు కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నారు.ఇలా విఐపి విరామ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్న రానా దంపతులు ఆలయం వెలుపల సందడి చేశారు.
ఈ విధంగా రానా దంపతులు ఆలయం బయట సందడి చేయడంతో ఓ అభిమాని ఏకంగా సెల్ఫీ తీసుకోవడం కోసం ఆరాటపడ్డారు.సర్ సెల్ఫీ అంటూ తన వద్దకు వెళ్ళగానే రానా సెల్ఫీ ఇవ్వకుండా తన ఫోన్ లాక్కొని ఆలయంలో ఇలా సెల్ఫీలు తీసుకోవడం ఏంటి అంటూ సీరియస్ అయ్యారు. అనంతరం ఆ అభిమాని ఫోన్ తనకిచ్చి పంపించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Hero Rana: కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం…
ఇకపోతే రానాతో పాటు ఆయన భార్య మిహికా, సురేష్ బాబు దంపతులు, రానా సోదరుడు అభిరామ్ కూడా తిరుమలలో సందడి చేశారు.ఇక రానా సినిమాల విషయానికొస్తే ఈయన హీరోగానో విలన్ గాను వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రానా మంచి హిట్ అందుకున్నారు అనంతరం నక్సలిజం బ్యాక్గ్రౌండ్ తెరకెక్కిన విరాటపర్వం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

































