ఆర్ఎక్స్ 100 చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు కార్తికేయ. ఈయన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకొని ఆ తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కార్తికేయ తన నిశ్చితార్థం చేరుకొని తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు.

కార్తికేయ తన కాలేజీ సమయంలో లోహిత అనే అమ్మాయిని గత పది సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడని ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పి తన పెళ్ళికి ఒప్పించారని మనకు తెలిసిందే. ఇలా నిశ్చితార్థం జరుపుకున్న కార్తికేయ ఈనెల 21వ తేదీన పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.ఈ నెల 21వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా సినీ ప్రముఖుల సమక్షంలో కార్తికేయ లోహిత మెడలో మూడు ముళ్లు వేయనున్నారు.
ఈ క్రమంలోనే వీరి వివాహ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కార్తికేయ లోహిత వెడ్డింగ్ కార్డ్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇక తాజాగా కార్తికేయ నటించిన విక్రమార్క సినిమా రిలీజ్ వేడుకలో భాగంగా తన భార్యను అందరికీ పరిచయం చేసి ఆ వేదిక పైన తనకు ప్రపోస్ చేశారు.
ఈ నెల 21వ తేదీ ఉదయం 9:47 నిమిషాలకు కార్తికేయ లోహిత మెడలో మూడు ముళ్లు వేయనున్నారు.సోషల్ మీడియా వేదికగా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కార్తికేయ వివాహానికి ఎంతో మంది ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇక లోహిత విషయానికి వస్తే ఆమె కర్నూలుకు చెందిన చిన కొండారెడ్డి అనే ఒక వ్యాపారవేత్త కూతురు అని తెలుస్తుంది.
































