Hero Sumanth Ashwin : సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ అనగానే వర్షం, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్ధంటానా వంటి వరుస హిట్ సినిమాలు అందరికీ గుర్తొస్తాయి. కేవలం నిర్మాత అంటే సినిమాలకు డబ్బు ఇవ్వడం కాదు, నిర్మాత సినిమా తీయాలనే అభిరుచి ఉంటే అతనే కథ తయారుచేసుకుని సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఎమ్ఎస్ రాజు గారు చూపించారు. ఇక ఆయన నిర్మాణ సంస్థనుండి సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా సినిమా సూపర్ అనేంతలా ఆయన బ్రాండును క్రియేట్ చేసుకున్నారు. ఇక ఆయన కొడుకుగా సినిమాల్లోకి అడుగుపెట్టిన సుమంత్ అశ్విన్ తూనిగా తూనిగా, కేరింత అంటూ కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా ఇంకా రాణించలేదు. ఎంతో మంది హీరోలను సుపర్ స్టార్లను చేసిన ఎమ్ఎస్ రాజు గారు ఆయన కొడుకును హీరోగా నిలబెట్టడానిక ఇటీవల సినిమా ఆయనే డైరెక్షన్ చేసినా పెద్దగా ఆడలేదు.

మహేష్ నా మీద కంప్లైంట్ చేసాడు…
సుమంత్ అశ్విన్ కు ఇండస్ట్రీలో స్నేహితులున్నా క్లోస్ ఫ్రెండ్స్ లేరంటూ చెబుతాడు. తాను సోషల్ గా పెద్దగా కలవనని అందుకే ఇప్పుడున్న హీరోల్లో అందరూ పరిచయం ఉన్నా క్లోజ్ ఎవరితోనూ లేనంటూ చెప్పారు. ఇక తన తండ్రి తనకంటే యూత్ ఫుల్ గా ఆలోచిస్తారని ఒక 18 ఏళ్ల అబ్బాయి డైరెక్టర్ గా ఎలా ఆలోచిస్తాడో అలాంటి ఫ్రెష్ కథలను నాన్న ఆలోచిస్తారంటూ చెప్పారు.

ఇక తన తండ్రి సినిమాలతో సూపర్ స్టార్స్ గా ఎదిగిన మహేష్, ప్రభాస్ లు ఇప్పటికీ తన తండ్రికి అంతే గౌరవం ఇస్తారని, వాళ్ళను పిలిస్తే సినిమా ప్రొమోషన్స్ కు వస్తారు కానీ అలా చేయడం పెద్దగా ఇష్టం లేదంటూ చెప్పిన సుమంత్ తాను డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన కొత్తలో చాలా ర్యాష్ గా కారు నడుపుతూ వెళ్తుండగా మహేష్ బాబు చూసి మా నాన్నకు మీ అబ్బాయి కారు మరీ ర్యాష్ గా తోలుతున్నాడు చూడండి అని కంప్లైంట్ చేశాడంటూ చెప్పాడు అశ్విన్.

































