స్లిమ్ అయిన ఖుష్బు.. బరువు తగ్గడానికి సీక్రెట్ ఏమిటంటే?

0
463

అలనాటి తారల్లో చెప్పుకోదగిన హీరోయిన్ ఖుష్బు. అందాలనటిగా ఎంతో గుర్తిపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంది. బొద్దుగుమ్మగా అందరికీ తెలిసిన ఖుష్బూ ఇటీవల స్లిమ్ లుక్ లో దర్శనమిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంత బరువు తగ్గడానికి గల కారణాన్ని కూడా ఆమె వివరించింది.

తమిళంలో డ్యాన్స్ వర్సెస్ డ్యాన్స్ రియాలిటీ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న ఖుష్బూ ఆసక్తికర అంశాలు పంచుకుంది. మొదట తాను పెళ్లి చేసుకోవడం.. తర్వాత పిల్లలు కనడం లాంటివి జరగడంతో విపరీతంగా బరువు పెరిగానని.. అయితే, లాక్ డౌన్ వేళ ఖాళీ సమయం దొరకడంతో బరువు తగ్గడంపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దాదాపు 15 కిలోల వరకు తగ్గినట్లు చెప్పుకొచ్చారు.

తాను పెళ్లి చేసుకున్న సమయంలో ధరించిన దుస్తులు కూడా ఇప్పుడు సరిపోతున్నాయని ఆనందం వ్యక్తం చేసింది. బరవు తగ్గడానికి తనకు ఎంతో ఇష్టమైన బిర్యానీలు, ఐస్ క్రీములకను త్యాగం చేసినట్లు చెప్పారు. క్రమం తప్పకుండా యోగా చేశానని వివరించింది. రోజూ 40 నిమిషాల పాటు నడిచేదాన్నని వెల్లడించింది.

ఇక లాక్ డౌన్ సమయంలో పనిమనిషి ఇంటికి రాలేని పరిస్థితి. దాంతో ఇంట్లో పని మొత్తం తానే చేసుకున్నానని. అంట్లు తోమడం నుంచి బట్టలు ఉతకడం వరకు అన్ని పనుల చేశానని ఖుష్బూ పేర్కొంది. 2020 నవంబర్లో తన బరువు దాదాపు 92 కిలోలు ఉన్నానని.. ప్రస్తుతం 77 కిలోలకు వచ్చినట్లు ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నానని.. దాని కోసం కఠినమైన ఆహార నియమాలు పాటిస్తున్నానని చెప్పుకొచ్చింది ఖుష్బు.