Heroine Reba Monica John : రీసెంట్ గా తెలుగులో శ్రీ విష్ణు హీరోగా వచ్చిన సినిమా ‘సామజవరగమన’. కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాలో మొదటిసారి తెలుగులో నటించింది మలయాళం ముద్దుగుమ్మ రెబా మౌనిక జాన్. బెంగళూరు కి చెందిన ఈ మలయాలి గుమ్మ ఆల్రెడీ ఒక తెలుగు ఓటిటి సినిమా ‘బూ’ లో నటించింది. ఇక తమిళంలో తలపతి విజయ్ ‘బిగిల్’ అలాగే మలయాళంలో నవీన్ పాల్ సినిమాలో హీరోయిన్ గా నటించి హిట్లు అందుకుంది. తెలుగులో సామజవరగమన సినిమా సక్సెస్ తరువాత తెలుగులో ఇంటర్వ్యూలతో బిజీ అయిన ఈ ముద్దుగుమ్మ తాజాగా తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.

ఒక స్టార్ హీరో డేట్ కి పిలిచాడు…
తన కెరీర్ అలాగే తనకు అవకాశాలు ఎలా వచ్చాయి వంటి విషయాలను రెబా మౌనిక జాన్ పంచుకుంటూ తాను ఒకానొక దశలో ఒక స్టార్ హీరో డేట్ కి రమ్మన్నాడంటూ చెప్పి బాంబు పేల్చింది. ఆ హీరో ఎవరన్నది చెప్పడానికి ఇష్టపడకపోయినా తనకు ఇలాంటివి ఎదురయ్యాయని తెలిపింది.

అయితే అవన్నీ ఇండస్ట్రీలో మామూలే అని, నచ్చితే డేట్ కి వెళతాం లేదంటే నో చెప్తాం, నాకు ఇంట్రస్ట్ లేదని చెప్పాను అంటూ నవ్వేసింది ఈ ముద్దుగుమ్మ. నేను చాలా పాజిటివ్ గా ఉంటానని పెద్దగా వీటిని పట్టించుకోనని చెప్పింది. ఇక రెబా మౌనికా జాన్ గత సంవత్సరం జోయెమన్ జోసెఫ్ అనే వ్యక్తిని పెళ్లాడింది.