టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత విడాకుల ప్రకటన తర్వాత నిత్యం ఏదో ఒక వార్త ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ వార్తల్లో ఉండే సమంత చైతుతో గడిపిన జ్ఞాపకాలను మర్చిపోతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే విడాకుల బాధ నుంచి బయట పడటం కోసం పలు తీర్థయాత్రలు, విదేశీ పర్యటనలు చేస్తూ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. విడాకుల తర్వాత సమంత ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక త్వరలోనే సమంత తన పూర్తి దృష్టిని సినిమాల వైపు పెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా డ్రీమ్స్ వారియర్ పిక్చర్స్, శ్రీదేవి మూవీస్ బ్యానర్లు మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉండగా సమంత త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇలా వరుస అవకాశాలను అందుకుంటున్న సమంత తన తదుపరి సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒక్కో సినిమాకు సమంత మూడు కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈమె అడిగిన మొత్తంలో నిర్మాతలు ఈమెకు పారితోషికం చెల్లించి సినిమా అవకాశాలను ఇస్తారా లేక వెనక్కి తగ్గుతారా తెలియాల్సి ఉంది.































