టాలీవుడ్ టాప్ హీరోయిన్ నటి సమంత వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. విడాకుల ప్రకటన తర్వాత ఎన్నో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎంత బిజీగా ఉన్న సమంతకు తీవ్ర అస్వస్థత చేయడంతో ఆమె ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది.గత రెండు రోజుల నుంచి సమంత నిత్యం ఎంతో బిజీగా గడుపుతున్నారు ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో భాగంగా కడపకు వెళ్లిన ఈమె ఆ తర్వాత తిరుప,తి శ్రీకాళహస్తి దైవ దర్శనాలకి వెళ్ళింది.

ఇలా ఏమాత్రం విరామం లేకుండా ప్రయాణాలు చేయడంతో ఈమె అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సమంతకు జ్వరం, జలుబుతో బాధపడగా ముందు జాగ్రత్తలతోనే ఈమె ఆస్పత్రికి చేరి వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందడంతో సమంత ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం వెళ్ళిన ఈమెకు వైద్యులు పలు రకాల పరీక్షలు చేసి భయపడాల్సిన పని లేదని, చెప్పడంతో పరీక్షల అనంతరం సమంత తిరిగి ఇంటికి వెళ్ళింది. అయితే గత రెండు మూడు రోజుల నుంచి సమంత ఎంత బిజీగా ఉండటంవల్ల కాస్త అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
ఇక ఈమె నటించిన సినిమాల విషయానికి వస్తే శాకుంతలం విడుదలకు సిద్ధంగా ఉంది అలాగే యశోద అనే పాన్ ఇండియా స్థాయి సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ఇకపోతే పుష్ప సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు ఈ నెల డిసెంబర్ 17వ తేదీ రానుంది.































