మారుతున్న జీవన గమనంలో పని ఒత్తిడి కారణంగా మనం తీసుకునే ఆహారం సరిపోదు తద్వారా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి అనేక వ్యాధులకు కారణం కావచ్చు. దాన్ని అధిగమించడానికి అదనపు ఆహారం చాలా అవసరం అదనపు ఆహారంగా పొద్దున బ్రేక్ ఫాస్ట్ తర్వాత లంచ్ కు మధ్యలో మరియు లంచ్ కు రాత్రి డిన్నర్ కు మధ్యలో అత్యధిక ప్రోటీన్స్ కలిగిన ఆహారాన్ని స్నాక్స్ గా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయిన ప్రోటీన్, విటమిన్స్ ,మినరల్స్ సమృద్ధిగా అందించి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.

బాదంపప్పు లో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, యాంటిఆక్సిడెంట్స్, విటమిన్స్, పుష్కలంగా లభిస్తాయి. కేలరీలు తక్కువగా ఉండే బాదంపప్పును అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు. బాదంపప్పు రాత్రి నానబెట్టి మరునాడు బ్రేక్ ఫాస్ట్ తర్వాత స్నాక్స్ గా తీసుకోవడం వల్ల వీటిలో ఉండే మోనో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ మీ శరీరానికి మేలు చేసి అధిక బరువును కూడా తగ్గిస్తాయి.శనగల్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ వీటిని నానబెట్టి లేద ఉడికించి రోజు తీసుకుంటే మనలోఎనర్జీ బూస్ట్ జరుగుతుంది.
ప్రతిరోజు ఉడకబెట్టిన గుడ్డును స్నాక్స్ రూపంలో తీసుకోవడం వల్ల మన శరీరానికి అదనంగా12 గ్రాముల ప్రొటీన్ లభించినట్లే. కర్జూరం ఉదయం సాయంత్రం అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు.వారానికి కనీసం రెండుసార్లయినా వీటిని తినడం వల్ల ఎర్ర రక్తకణాలు అభివృద్ధి చెంది అనీమియాను దూరం చేస్తుంది. బరువు తగ్గాలనే వారికి ఇది చక్కటి పరిష్కార మార్గం.ఇలా ప్రతిరోజు బలవర్థకమైన ఆహారాన్ని అదనంగా స్నాక్స్ రూపంలో తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు సమృద్ధిగా లభించి నిత్యం ఆరోగ్యవంతంగా ఉంటాం.


































