మరో నాలుగు వారాల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. కరోనా విజృంభణ వల్ల ఈ ఏడాది అన్ని రంగాలు దెబ్బ తిన్నాయి. దీంతో చాలా కంపెనీలు ఇయర్ ఎండ్ సేల్ పేరుతో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెస్తున్నాయి. కొత్త కారు కొనాలనుకునే కస్టమర్లకు హోండా కంపెనీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. బీఎస్ 6 కార్లపై గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ డిస్కౌంట్ ను ప్రకటించి కస్టమర్లకు ప్రయోజనం చేకూరుస్తోంది.

భారీగా తగ్గింపు ప్రయోజనాలను కల్పిస్తూ తక్కువ మొత్తానికే కారు కొనుగోలు చేసే అవకాశాన్ని కంపెనీలు కల్పిస్తున్నాయి. అయితే ఈ తగ్గింపును నేరుగా కాకుండా బెనిఫిట్స్ ఇస్తూ హోండా వినియోగదారులకు భారాన్ని తగ్గిస్తోంది. హోండా సిటీ 5వ జనరేషన్ కారుపై 30,000 రూపాయల కస్టమర్లు డిస్కౌంట్ బెనిఫిట్ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. హోండా అమేజ్ కారుపై ఏకంగా 37,000 రూపాయల డిస్కౌంట్ బెనిఫిట్ ప్రయోజనాలు పొందవచ్చు.
హోండా డబ్ల్యూఆర్‌వీ కారుపై, హోండా జాజ్ కారుపై కంపెనీ ఏకంగా 40,000 రూపాయల వరకు డిస్కౌంట్ బెనిఫిట్ ప్రయోజనాలను అందిస్తోంది. హోండా సివిక్ కారుపై కంపెనీ ఏకంగా 2,50,000 రూపాయల వరకు ప్రయోజనాలను అందిస్తూ ఉండటం గమనర్హం. అడిషనల్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, క్యాష్ డిస్కౌంట్ రూపంలో ఈ అదనపు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కొత్త కార్ల కొనుగోలుపై ఏకంగా రెండున్నర లక్షల రూపాయల వరకు తగ్గింపు పొందే అవకాశం కల్పిస్తూ ఉండటంతో కస్టమర్లు ఈ ఆఫర్ ను వినియోగించుకొని కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

































