Honey Rose: ఆ ఒక్క ఫోటోతో ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న హనీ రోజ్… ఈ క్రెడిట్ మొత్తం బాలయ్యదే!

0
27

Honey Rose: నటి హనీ రోజ్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని పేరు.బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాకి ముందు వరకు ఈమె తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం తెలియదు అయితే వీరసింహారెడ్డి సినిమా ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయినటువంటి హనీరోజ్ తెలుగులో బాగా పాపులారిటీ సొంతం చేసుకున్నారు.

ఈమె బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో వీరసింహారెడ్డి పాత్రలో నటించిన బాలయ్యకు భార్యగా నటించారు. ఇలా బాలకృష్ణ భార్యగా ఎంతో అద్భుతమైన నటనను కనబరిచిన ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం లేనటువంటి హనీ రోజ్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

వీర సింహారెడ్డి సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ పదేపదే హనీ రోజ్ గురించి ప్రస్తావించడమే కాకుండా ఆమెపై ఉన్నటువంటి అభిమానాన్ని విభిన్నంగా చూపించారు. వీరిద్దరూ కలిసి మందు కొడుతూ ఉన్నటువంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Honey Rose: బాలయ్య పుణ్యమా అని ట్రెండ్ అవుతున్న హాని రోజ్..

ఇలా ఈ ఫోటోతో ఒక్కసారిగా నటి హనీ రోజ్ సోషల్ మీడియాలో ఫ్రెండ్ అవుతూ వచ్చారు. ఇలా సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ట్రెండ్ అవుతున్న వారిలో నటి హనీ రోజ్ ఒకరు ఇలా ట్విట్టర్లో ఈమె ట్రెండ్ అవడం తను కూడా ఊహించలేదని తెలిపారు.అయితే బాలయ్య పుణ్యమా అని హాని రోజ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఈ క్రెడిట్ మొత్తం బాలయ్యకే చెందుతుందని పలువురు ఈ విషయంపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.