Bangarraju Movie: అక్కినేని నాగార్జున నాగ చైతన్య కలిసి నటించిన బంగార్రాజు చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న బంగార్రాజు చిత్రాన్ని 2016 లో విడుదలైన సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కించారు. ఆ సినిమాలో ఎండింగ్ తో ఈ సినిమా మొదలుపెట్టారు.

బంగార్రాజు సినిమాల్లో నాగార్జున నరకానికి కాకుండా స్వర్గానికి వెళ్లి రంభ ఊర్వశి మేనకలతో సరసాలాడటం చూపిస్తారు.ఇకపోతే ఈ సినిమాలో నాగార్జున మనవడిగా చిన్న బంగార్రాజు పాత్రలో నాగచైతన్య నటించారు. చిన్న బంగార్రాజు జన్మించగానే తన తల్లి సీతమ్మ (లావణ్య త్రిపాటి) చనిపోయినట్లు చూపిస్తారు.

కొన్ని సంవత్సరాల తర్వాత సత్యమ్మ (రమ్యకృష్ణ) కూడా మరణించి స్వర్గానికి వెళుతుంది. స్వర్గం నుంచి వారి మనవడు ఎదుర్కొంటున్న కష్టాలను చూసి వీరిద్దరూ భూమి పైకి వచ్చి తన మనవడిని చక్కదిద్దారు. ఇది బంగార్రాజు సినిమా కథ.అయితే ఈ కథలో ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారని నెటిజన్లు పెద్దఎత్తున సోషల్ మీడియాలో చర్చలు జరుపుతున్నారు.
అందుకే లావణ్య త్రిపాఠి పాత్ర లేదు..
సత్యమ్మ (రమ్యకృష్ణ) కంటే ముందుగా సీతమ్మ చనిపోతుంది. అయితే ఆమె మాత్రం స్వర్గంలో చూపించలేదు. ఈ చిన్న లాజిక్ బంగార్రాజు ఎలా మర్చిపోయారని నెటిజన్లు పెద్దఎత్తున ఈ విషయంపై చర్చలు జరుపుతున్నారు. అయితే ఇలా లావణ్య త్రిపాఠి చూపించకపోవడానికి కూడా ఒక కారణం ఉంది. ఇదివరకే లావణ్య త్రిపాఠి నాగచైతన్య కలిసి నటించారు కనుక ఈ సినిమాలో తనని నాగచైతన్య తల్లి పాత్రలో చూపించలేక తన పాత్రకు అక్కడితో ముగింపు పలికారని డైరెక్టర్ ఒకానొక సందర్భంలో తెలియజేశారు. అందుకే ఇలాంటి లాజిక్కుల గురించి మాట్లాడకుండా సినిమాని మాత్రమే ఆనందించాలి.































