Hyper Aadi:హైపర్ ఆది ఎక్కడుంటే అక్కడే అసలుసిసలైన కామెడీ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. అది జబర్దస్త్ షో అయిన లేదా ఢీ షో అయినా హైపర్ ఆది ఏమాత్రం తగ్గకుండా తన పంచులు వర్షం కురిపిస్తారు. జబర్దస్త్ సెట్లో అనసూయతో చేసే రచ్చ మామూలుగా ఉండదు. అలాగే ఢీ లో ప్రియమణి నందిత శ్వేతతో కలసి హైపర్ ఆది రచ్చ చేస్తుంటారు అనే సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఢీ వేదికపై హైపర్ ఆది ప్రియమణితో హగ్గులు, బావ అని పిలుపించుకోవడం చేస్తూ ఆది తెగ రెచ్చిపోతుంటాడు. ఇక ఈ మధ్య కొత్తగా వచ్చిన నందిత శ్వేతతో కూడా పులిహోర కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైపర్ ఆది మరోసారి రెచ్చిపోయి తన పర్ఫామెన్స్ చూపించారు.

కడుపు మంట బయటపెట్టిన ఆది..
పుష్ప సినిమాలో డైలాగులు చెబుతూ అందరిని ఆకట్టుకున్నారు. ఆది అంటే బొగ్గు అనుకుంటివా.. హగ్గు అంటూ ప్రియమణి నందిత శ్వేతతో హగ్ కోసం వారి దగ్గరకు వస్తారు. కానీ ఆ అవకాశం హైపర్ ఆది దక్కకుండా జానీ మాస్టర్ ఆ ఇద్దరు హీరోయిన్లతో హగ్స్ తీసుకుంటూ ఉండగా కడుపుమంటతో రగిలిపోతుంటే హైపర్ ఆది మా పేర్లు చెప్పుకొని ఎన్నిసార్లు హగ్స్ తీసుకుంటారు అంటూ తన ఆవేదన బయటపెడుతూ జానీ మాస్టర్ పై రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.






























