25 రూపాయలకే కొత్త ఓటర్ కార్డ్.. ఎలా పొందాలంటే..?

0
409

మనలో చాలామంది ఓటర్ కార్డ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎన్నికల సమయంలో తప్ప మిగతా సమయాల్లో ఓటర్ కార్డు గురించి ఎక్కువగా ఆలోచించరు. ఇలా చేయడం వల్ల అవసరమైన సమయంలో ఓటర్ కార్డ్ దొరకక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అయితే మన దగ్గర ఓటర్ కార్డ్ లేకపోయినా, బ్లాక్ అండ్ వైట్ కలర్ ఓటర్ కార్డ్ ఉన్నా అవసరం అనుకుంటే కొత్త కలర్ వోటర్ కార్డును పొందవచ్చు.

కేవలం 25 రూపాయలకే కలర్ ఓటర్ కార్డును సులభంగా పొందే అవకాశం ఉంటుంది. ఈ కలర్ ఓటర్ కార్డు గతంలో ఇచ్చిన కార్డులతో పోలిస్తే మరింత నాణ్యతతో ఉంటుంది. అందువల్ల ఈ కార్డు సంవత్సరాలు గడిచినా మన్నిక ఉంటుంది. కొత్త ఓటర్ కార్డును పొందాలనుకునే వాళ్లు ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ కు వెళ్లి అకౌంట్ ను క్రియేట్ చేసుకుని లాగిన్ కావాల్సి ఉంటుంది. యూజర్ ఐడీ, పాస్ వర్డ్ సరిగ్గా ఎంటర్ చేసి లాగిన్ అయిన తరువాత రీప్లేస్ మెంట్ ఓటర్ ఐడీకార్డ్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఆ తరువాత ఓటర్ కార్డ్ నంబర్ ను ఎంటర్ చేసి రిప్లేస్ మెంట్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తరువాత మొబైల్ నంబర్ ను, మొబైల్ నంబర్ కు వచ్చిన వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఓటర్ కార్డును రిప్లేస్ మెంట్ చేసుకోవడానికి గల కారణాన్ని పొందుపరిచి సేవ్ చేయాలి. అలా సేవ్ చేసిన తరువాత పేమెంట్ ఆప్షన్ వస్తుంది.

ఆ విధంగా చేసి 25 రూపాయలు చెల్లించడం ద్వారా సులభంగా కొత్త ఓటర్ కార్డును పొందవచ్చు. ఓటర్ కార్డు మనకు ఓటు వేయడానికి మాత్రమే కాకుండా గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగపడుతుంది. దరఖాస్తు చేసిన కొన్ని రోజుల్లోనే ఇంటికి కొత్త పీవీసీ కార్డ్ వస్తుంది.