Ram Gopal Varma: ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ కు మధ్య టికెట్ల రేట్ల వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఇండస్ట్రీ పెద్దలు మంత్రి పేర్ని నానిని కలిసినా.. ప్రభుత్వం ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే కనిపించడం లేదు.

మరోవైపు హీరో నాని, సిద్ధార్థ్ వంటి వారు నేరుగా వైసీపీ ప్రభుత్వం పైనే కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల శ్యామ్ సింగరాయ్ సినిమా విడుదలకు ముందు హీరో నాని… ఏపీలో సినిమా థియేటర్ కలెక్షన్లు… కిరాణా కొట్టు కలెక్షన్ల కన్నా తక్కువ ఉన్నాయంటూ కామెంట్లు చేశారు. దీనికి ఏపీ మంత్రి పేర్ని నాని కూడా.. స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు.

ఇదిలా ఉంటే ఈవివాదంలోకి రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చారు. టికెట్ రేట్ల విషయంపై ఏపీ ప్రభుత్వానికి ట్విట్టర్ ద్వారా పలు ప్రశ్నలు సంధించారు. మంత్రి పేర్ని నాని, ఆర్జీవి మధ్య ట్విట్టర్ యుద్దమే జరిగిందని చెప్పారు. అయితే నిన్న మంత్రి పేర్ని నాని, ఆర్జీవీ భేటీ అయ్యారు. సినిమా ఇండస్ట్రీపై టికెట్ ధరల తగ్గింపు ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో… తెలియజేశారు. అయితే సమస్య అక్కడితోనే ముగిసిందని అందరూ అనుకున్నారు.
ఏపీ ప్రభుత్వానికి ట్విట్టర్ ద్వారా..
అయితే మరోసారి ఏపీ ప్రభుత్వానికి ట్విట్టర్ ద్వారా మరో ప్రశ్నను సంధించారు రామ్ గోపాల్ వర్మ. తనదైన రీతిలో ‘ కట్టప్పను ఎవరు చంపారు’ అంటూ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ముంబైలో ట్రిపుల్ ఆర్ టికెట్ ధర రూ.2200 ఉందని… ఏపీలో మాత్రం కనీసం రూ.200 కూడా లేదని ఆయన అన్నారు. తెలుగు ఇండస్ట్రీని ప్రభుత్వం చంపెస్తుందనే ఉద్దేశ్యం వచ్చేలా… కట్టప్పను ఎవరు చంపారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Maharashtra state allowing @ssrajamouli ‘s RRR ticket price to sell at Rs 2200/- and his home state AP not even allowing to sell at Rs 200/- raises an existential question “WHO KILLED KATTAPPA? “
— Ram Gopal Varma (@RGVzoomin) January 11, 2022






























