Hrithik Roshan: బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కొన్ని సంవత్సరాల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకున్న ఈయన క్రిష్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు.

ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హృతిక్ రోషన్ 2014వ సంవత్సరంలో తన భార్య సుహాన్నే ఖాన్ నుంచి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకున్నా తమ పిల్లల కోసం ఇద్దరూ కలిసి వారిని హాలిడే వెకేషన్ కి తీసుకెళ్లడం, వారి కోసం తరచూ కలవడం వంటివి చేస్తున్నారు.

ఇలా విడాకులు తీసుకున్నా పిల్లలకోసం దగ్గరగా ఉంటున్నప్పటికీ తాజాగా హృతిక్ రోషన్ మరొక యంగ్ బ్యూటీ తో లవ్ లో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఈ హీరో తాజాగా మరోక బ్యూటీతో డిన్నర్ డేట్ కి వెళ్లడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి.
నటి సబా ఆజాద్ అంటూ..
ముంబైలో ఒక రెస్టారెంట్ నుంచి ఓ మహిళ చేయి పట్టుకొని హృతిక్ రోషన్ బయటకు రావడంతో సంఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె మాస్క్ పెట్టుకోవడం వల్ల ఎవరా అనే విషయం క్లారిటీగా తెలియకపోయినప్పటికీ కొందరు మాత్రం ఆమె ఓటిటితో గుర్తింపు పొందిన సబా ఆజాద్ అని అంటున్నారు. గత ఏడాది నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమైన ఆంథాలజీ ‘ఫీల్స్ లైక్ ఇష్క్’లో ఈమె నటించారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

































