భార్యభర్తల మధ్య మనస్పర్థలు అనేవి సర్వసాధారణం. అయితే వాటిని నాలుగు గోడల మధ్య పరిష్కరించుకొని.. సంసార జీవితాన్ని నడపాలి.. కానీ.. పది మందిలోకి ఈ వ్యవహారం వెళ్ల కూడదు. ఒక వేళ వెళ్లినా మరోసారి ఈ వ్యవహరం రిపీట్ కాకుండా ఉంటే కుటుంబంలో ఎలాంటి గొడవలు చోటు చేసుకోవు.

కొందరు క్షణికావేశంలో ప్రాణాలు తీయడమో.. ప్రాణాలు తీసుకోవడమో జరుగుతోంది. ఇలాంటి ఘటనల వల్ల వాళ్లపై ఆధారపడిన కటుంబసభ్యులు అనాథలుగా మారుతున్నారు. ఇక్కడ చెప్పే దంపతుల విషయం ఏంటంటే.. మధ్యప్రదేశ్ లోని టికంగఢ్ జిల్లాకు చెందిన వీళ్లు.. రామ్ నగర్ లో నివాసం ఉంటుంన్నారు.
వారిద్దరికి వివాహం అయిన చాలా సంవత్సరాలు అయింది. మొదట్లో వీరిద్దరు బాగానే ఉన్నా.. రాను రాను మనస్పర్థలు ఎక్కువ అయ్యాయి. దీంతో వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారు. వీరిద్దరి గొడవ పెద్ద పనుషుల దాకా వెళ్లింది. ఇద్దరు కలిసి ఉండాలని.. బలవంతపు కాపురం చేయాలని సూచించారు.
ఈ నేపథ్యంలో భార్యతో అతడు బలవంతంగా కాపురం చేస్తున్న క్రమంలో భార్య కత్తి తీసుకొని అతడి మర్మాంగాన్ని కోసేసింది. అక్కడిక్కడే అతడు గిల గిల కొట్టుకుంటూ కిందపడిపోయాడు. ఆ ఘటనా స్థలం వద్ద తీవ్ర రక్తస్రావం అయింది. ఇరుగుపొరుగు వాళ్లు అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స అనంతరం బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

































