Hyper Aadi: హైపర్ ఆది ఏ కార్యక్రమంలోనైనా అడుగుపెట్టారంటే అక్కడ తన పంచ్ డైలాగులతో అందరిని కడుపుబ్బ నవిస్తారు.ఇలా హైపర్ ఆది కామెడీ టైమింగ్ కు విపరీతమైన అభిమానులు ఉన్నారు. అయితే కొన్నిసార్లు ఈయన చేసే కామెడీ శృతి మించి పలు వివాదాలకు కారణమయ్యే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు ఈయన తీవ్ర విమర్శల పాలయ్యారు.

ఇదిలా ఉండగా తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా ఎప్పటిలాగే కంటెంట్ లో తమ ఆటపాటలతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమం చివరిలో యాంకర్ రష్మీ ఒక టాస్క్ నిర్వహించారు.ఇందులో భాగంగా కొందరి కమెడియన్ ఫోటోలను టేబుల్ పై పెట్టి ఎవరి వల్ల బాధపడి ఉంటారో తమకు నచ్చిన వారి ఫోటో తీసి చింపేయడం లేదా కాల్చి వేయడం చేయాలి అని టాస్క్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే మొదట ఆటో రాంప్రసాద్ వేదిక పైకి వచ్చి తాను హైపర్ ఆది వల్ల ఒక విషయంలో చాలా బాధపడ్డానని తనకు సారీ చెబుతూ తన ఫోటో కాల్చివేశాడు.ఇక పరదేశి నాకు అన్ని హైపర్ ఆది అన్న అయినప్పటికీ ఆయన వల్ల నేను చాలా బాధపడ్డాను అంటూ తన ఫోటో చింపి వేశాడు. ఇలా ఒక్కొక్కరు వచ్చి హైపర్ ఆది ఫోటో చింపి వేయడంతో హైపర్ ఆది ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Hyper Aadi: హైపర్ ఆది ఎవరిని టార్గెట్ చేశారు…
ఇక చివరికి రష్మీ కూడా హైపర్ ఆది ఫోటో తీసుకొని చింపి వేసింది. తాను హైపర్ ఆది ఫోటో చింపి వేయడానికి కారణం కూడా తెలిపింది.తాను శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ గా వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్ లో హైపర్ ఆది మాట్లాడుతూ రష్మీ ఎప్పుడు వచ్చావు అని అడగకుండా ఎప్పుడు వెళ్ళిపోతావు అని ప్రశ్నించాడని దానివల్ల తను చాలా బాధపడ్డానని ఈమె రీజన్ తెలిపారు.ఇకపోతే చివరికి హైపర్ ఆది వంతు వచ్చింది. ఈయన కూడా ఒకరి ఫోటో చేతిలో పట్టుకున్నారు. అయితే ఆయన ఎవరిని టార్గెట్ చేశారు అన్నది మాత్రం సస్పెన్స్ పెట్టారు.మరి హైపర్ ఆది ఎవరిని టార్గెట్ చేశారనే విషయం తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాలి ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.































