Hyper Aadi: హైపర్ ఆది తన కామెడీతో ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేస్తారో అదేవిధంగా తన నోటి దూలతో ఎన్నో వివాదాలను సృష్టిస్తూ ఉంటారు. ఈయన స్టార్ కమెడియన్ గా గుర్తింపు పొందిన తర్వాత కాస్త నోరు జారడం ఎక్కువైందని చెప్పాలి.ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచిన హైపర్ ఆది బహిరంగంగా తాను మాట్లాడిన మాటలకు క్షమాపణలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఈ విధంగా హైపర్ ఆది నెటిజన్ల నుంచి ఎన్నోసార్లు భారీగా ట్రోలింగ్ కి గురైనప్పటికీ తన పంతం మాత్రం మార్చుకోలేదు.తాజాగా మరోసారి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఈయన సెటైర్లు వేశారు. దీంతో వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున హైపర్ ఆదిని సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.

హైపర్ ఆది శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంతో పాటు ఢీ ఈ కార్యక్రమంలో కూడా సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో భాగంగా హైపర్ ఆది పొలిటికల్ ఎంట్రీ థీమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే మరో ఇద్దరు అబ్బాయిలతో కలిసి తాను పార్టీ పెట్టానని తెలిపారు. తన పార్టీ పేరు ‘వేస్తే వెయ్.. లేకపోతే…’ అనే పార్టీని పెట్టినట్లు చెప్పాడు. అది ఈ విధంగా తన పార్టీ పేరు చెప్పడంతో ఒక్కసారిగా అందరూ నవ్వుకున్నారు ఇక పోతే మిగతా ఇద్దరి పార్టీ పేరు ఏంటి అని ప్రశ్నించారు.
ఫైర్ అవుతున్న వైసీపీ ఫాన్స్..
ఈ క్రమంలోనే ఒక కుర్రాడు “మేము ఉన్నాం” అని చెప్పగా మరొక కుర్రాడు తన పార్టీ పేరు “మేము విన్నాం” అని చెప్పగానే హైపర్ ఆది సరే మేము ఉంటాం అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విధంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సమయంలో ఉపయోగించిన ఈ డైలాగ్ తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో కూడా ఉపయోగించారు. ఈ క్రమంలోనే హైపర్ ఆది తిరిగి తన స్కిట్ కోసం జగన్మోహన్ రెడ్డి డైలాగులను ఈ విధంగా ఉపయోగించడంతో వైసీపీ అభిమానులు ఇతనిని భారీగా ట్రోల్ చేస్తున్నారు.



























