Shanmukh-Deepthi: సోషల్ మీడియా స్టార్స్ షణ్ముఖ్ జశ్వంత్ – దీప్తి సునయన తమ ఐదేళ్ల రిలేషన్ షిప్ కు బ్రేకప్ చెప్పుకున్నారు. తాజాగా దీప్తి సునయన తన ఇన్ స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. షన్నూతో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బిగ్ బాస్ పూర్తయిన తర్వాత నుంచే వీరిద్దరి బ్రేకప్ గురించి వార్తలు వచ్చాయి.

గతంలోనే దీప్తి సునయన ఇన్ స్టా నుంచి షన్నూను రిమూవ్ చేసింది. అయితే అప్పుడే చాలా మంది వాళ్ల అభిమానులకు ఎదో తేడాగా అనిపించింది. తాజాగా న్యూ ఇయర్ కు ఒక రోజు ముందు తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది దీప్తి. అయితే ఈ వ్యవహారం అంతటికి కారణం సిరినే అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.

సిరి వల్లే దీప్తి- షన్నూ విడిపోయారంటూ.. నెటిజెన్లు రియాక్ట్ అవుతున్నారు. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు సిరి, షణ్ముఖ్ మధ్య రిలేషన్ షిప్, వీరిద్దరి మధ్య కిస్సింగులు, హగ్గింగులు మితిమీరి పోయాయి. దీంతో పాటు ఎమోషనల్ గా కూడా వీరిద్దరు చాలా దగ్గరైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వీరిద్దరి వ్యవహారంపై సిరి వాళ్ల తల్లికూడా గట్టిగానే మందలించింది. అయితే మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే అని చెప్పినా.. వీరిద్దరి వ్యవహార శైలి నమ్మేలా లేదు.
Shanmukh-Deepthi: తొలిసారిగా స్పందించిన సిరి..
అయితే తాజాగా దీప్తి- షన్నూల మధ్య బ్రేకప్ కు తాను కారణం కాదంటూ ఎమోషనల్ అయినట్లు సమాచారం. వీరి బ్రేకప్ కు ’’నేను కారణం కాదు… ఇలా జరుగుతుందనుకోలేదంటూ‘‘.. తన ఫ్రెండ్స్ వద్ద ఎమోషనల్ అయినట్లు సమాచారం. షన్ముఖ్, దీప్తి సునయన బ్రేకప్ పై సిరి తొలిసారిగా స్పందించింది. ‘ఎవరైనా మీ దగ్గరికి వచ్చి.. మీ జీవితం చాలా కఠినంగా ఉందే అని కామెంట్స్ చేస్తే.. వాటికంటే నేను మరింత స్ట్రాంగ్ అని చిరునవ్వుతో సమాధానం చెప్పండి’ అంటూప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మునిబా మజారి చెప్పిన కోట్స్‌ని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీనిని బట్టి చూస్తే బ్రేకప్ తర్వాత బాధతో ఉన్న షన్ముఖ్ కోసమే ఇలా పోస్ట్ పెట్టిందని అంటున్నారు నెటిజెన్లు.




























