Actor Shivaji: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడు శివాజీ గురించి అందరికీ సుపరిచితమే ఈయన గతంలో పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. అయితే కొంతకాలం నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరమైనా శివాజీ రాజకీయాలలో బిజీగా ఉన్నారు. సినిమా వేడుకలో సందడి చేశారు. శ్రీ విష్ణు హీరోగా నటించిన అల్లూరి సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా శివాజీ పాల్గొన్నారు.

ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను బెక్కెం వేణుగోపాల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇకపోతే జూన్ 4వ తేదీ అల్లూరి 125 వ జయంతి వేడుకలను జరుపుకోవడంతో ఆయన జయంతి సందర్భంగా అల్లూరి సినిమా నుంచి టీజర్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా హీరో శివాజీ మాట్లాడుతూ పలు ఆశక్తికరమైన విషయాలను వెల్లడించారు.అల్లూరి అంటేనే అందరికీ సూపర్ స్టార్ కృష్ణ గారు గుర్తుకు వస్తారని, ఈయన అప్పటి అల్లూరి సీతారామరాజు సినిమాని గుర్తు చేసుకున్నారు.

ఈ సినిమా ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తిని రగిలించిన సినిమా అది అంటూ శివాజీ పేర్కొన్నారు. వేణుగోపాల్ గురించి ఈయన మాట్లాడుతూ.. గోపిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది తానేనని వెల్లడించారు. కొంతకాలం నుంచి గోపితో ఎంతో మంచి అనుబంధం ఉందని ఈయన ప్రతి ఒక్క కథను కూడా తనకే వివరిస్తాడని శివాజీ వెల్లడించారు. ఇక అల్లూరి కథ కూడా నాకు వివరించారని ఈ సినిమా విన్న తర్వాత గుండెల మీద చేయి వేసుకొని ఈ సినిమా చేయొచ్చు అంటే సలహా ఇచ్చామని శివాజీ పేర్కొన్నారు.
ఆ బస్సు ఘటన నన్ను ఇండస్ట్రీకి దూరం చేసింది…
ఇకపోతే శివాజీ చివరిగా ‘బూచమ్మా బూచాడు’ అనే సినిమాలో నటించారు. అయితే ఈయన సినిమాలకు దూరం కావడానికి ప్రధాన కారణం పాలెం బస్సు సంఘటన తనని సినిమా ఇండస్ట్రీకి దూరం చేసిందనీ ఈ సందర్భంగా. అప్పటినుంచి తాను సినిమాలలో నటించి ఉంటే ఎంత వరస్ట్ గా అన్నా 10 నుంచి 15 కోట్ల వరకు డబ్బులు సంపాదించే వాడినని కేవలం ఆ బస్సు ఘటన నన్ను ఇండస్ట్రీకి దూరం చేసిందని వెల్లడించారు. ఈ విధంగా హీరో శివాజీ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.































