Star Actress: ఈషా గుప్తా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. బోయపాటి శ్రీను రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన వినయ విధేయ రామ చిత్రంలో ఏక్ బార్ ఏక్ బార్ అంటూ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ అందరికీ సుపరిచితమే. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ సంపాదించుకోలేక పోయిన ఈ పాట మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది.

అడపాదడపా సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన ఈమెకు ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాలేదు.అవకాశాల కోసం గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రాకపోవడం గమనార్హం. ఇక ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ చిత్ర పరిశ్రమలో రంగు వివక్షత చాలా ఉంది అంటూ కామెంట్ చేశారు.

ఎక్కువ ఫెయిర్ ఉంటేనే అందం అనుకునేవాళ్ళు ఈ చిత్ర పరిశ్రమలో ఎక్కువగా ఉన్నారని, ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటనా నైపుణ్యం కన్నా కలర్ ఎంతో ఇంపార్టెంట్ అని వెల్లడించారు. ఈ విధంగా కలర్ కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నాలా నలుపు రంగులో ఉన్నవారికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వెల్లడించారు.
రంగు తక్కువగా ఉన్న వాళ్లు కూడా స్టార్ సెలబ్రెటీలుగా కొనసాగుతున్నారు…
బాలీవుడ్ ఇండస్ట్రీతో పోలిస్తే కొంతమేర సౌత్ ఇండస్ట్రీ ఎంతో మేలని అక్కడ నాలాంటి వాళ్లకు కూడా అవకాశాలు వస్తాయని ఈషా గుప్తా కామెంట్ చేశారు.ఇకపోతే ఈమె చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఇండస్ట్రీలో కలర్ కి సంబంధం లేకుండా ఎంతో మంది అవకాశాలు పొందిన వాళ్లు కూడా ఉన్నారంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.ఏదిఏమైనా ఈమె సినిమాలలో కన్నా సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నారు.
































