Rajashekar: టాలీవుడ్ యాంగ్రీ మెన్ రాజశేఖర్ సినీ ప్రస్థానం గురించి మనందరికీ తెలిసిందే. ఈయన ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే రాజశేఖర్ “శేఖర్” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరు ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి వచ్చారు.

ఈ సందర్భంగా నటి జీవితం మాట్లాడుతూ శేఖర్ సినిమా ద్వారా కొత్త రాజశేఖర్ ని చూస్తారని ఈ సినిమా గురించి చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో పంచుకున్నారు. ముఖ్యంగా మొట్టమొదటిసారి జీవిత రాజశేఖర్ ఎలా కలుసుకున్నారు అనే విషయం గురించి తెలిపారు వీరిద్దరు వేర్వేరు సినిమా ప్రివ్యూకి వెళ్లి వస్తున్న సమయంలో ఒకరినొకరు చూసుకున్నామని తెలిపారు.

తాజాగా రాజశేఖర్ నటిస్తున్న శేఖర్ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యానని ఈ కార్యక్రమం ద్వారా శేఖర్ సినిమా గురించి వెల్లడించారు.ఇక ఈ సినిమా మొదలు పెట్టాలి అనుకునే సమయంలో తాను కరోనా బారిన పడ్డారని తెలిపారు. కరోనా వచ్చిన సమయంలో ఎంతో ఇబ్బంది పడ్డామని దాదాపు నెల రోజుల పాటు ఐసీయూలో ఉండి చికిత్స తీసుకున్నానని తెలిపారు.
Rajasekhar : అన్ని మనం అనుకున్న విధంగా జరగవు..
కరోనా వచ్చిన సమయంలో ఎంతో ఇబ్బంది పడ్డానని ఆ సమయంలో రెండు మూడు రోజుల్లో చచ్చిపోతాను. ఇక నా శవాన్ని తీసుకెళ్లి చితికి నిప్పు పెడతారని అనుకున్నాను అంటూ ఆ విషయాన్ని గుర్తు చేసుకొని రాజశేఖర్ ఎమోషనల్ అయ్యారు.ఈ సందర్భంగా ఆలీ వీరిద్దరిని సినీ వారసులు ఉంటే బాగుండేది అని ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా అని ప్రశ్నించగా.. చాలాసార్లు వచ్చిందని అయినా అన్ని మనం అనుకున్నట్టుగా జరగవు కదా అంటూ ఈ కార్యక్రమంలో రాజశేఖర్ తన వ్యక్తిగత విషయాల గురించి తెలిపారు.




























