వివాదాలకు కేరాఫ్‌గా ఉండే రామ్‌గోపాల్ వర్మ ఏది చేసినా సెన్సేషనే. అలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేసే లేడీ యాంకర్లు కూడా యూట్యూబ్‌లో సెన్సేషనల్‌గా మారుతుంటారు. ఈ క్రమంలో ఆయనతో బిగ్‌బాస్ బ్యూటీలు చేసిన బోల్డ్ ఇంటర్వ్యూల రచ్చ అంతా ఇంత కాదు. జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఆర్జీవిని అరియాన గ్లోరీ చేసిన ఇంటర్వ్యూ ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అరియాన, ఆర్జీవీ బోల్డ్ ఇంటర్వ్యూ చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్య అరియాన బాటలో మరో బిగ్‌బాస్ భామ అషు రెడ్డి కూడా వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వీడియో విడుదల అయింది. నీ థైస్ బాగున్నాయంటూ వచ్చిన ఈ వీడియో ప్రోమో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
ఈ ఫుల్ వీడియోలో వర్మ చెంప పగలకొట్టిన తర్వాత నీ చెయ్యిని తాకే అదృష్టం దక్కుతుందని, కుట్ర పన్ని ఆ కామెంట్ చేశానని వర్మ, ఆమెకు షాక్ ఇస్తాడు. ఇక ఈ ఇంటర్వ్యూ అంతా ఎంత బోల్డ్ గా సాగిందంటే.. అషు రెడ్డి కూడా అలాంటి ప్రశ్నలే వేశారు. దానికి తగ్గట్టుగానే వర్మ సమాధానం ఇచ్చాడు. వర్మ కూడా అషు రెడ్డిని కొన్ని ప్రశ్నలు అడుగుతారు.
అందులో ముఖ్యంగా.. తనకు నీలి చిత్రాలు చూసే అలవాటు ఉందన్న వర్మ, నువ్వు నీలి చిత్రాలు చూస్తావా.. అని ఆషురెడ్డిని అడిగారు. లేదు కానీ తన స్నేహితులు చూస్తారని ఆమె చెబుతుంది. తర్వాత వర్మ మళ్లీ తనదైన స్టైల్ లో అడగడంతో ఆమె ఇలా చెప్పింది.. తాను నీలి చిత్రాలు చూస్తానని.. కొత్తవాళ్ల దగ్గర ఇలాంటి విషయాలను ఓపెన్ చేయలేం కదా.. అంటూ అషురెడ్డి చెప్పుకొచ్చారు.































