Actor Prudhvi Raj:30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఇండస్ట్రీలో కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటుడు పృథ్వీరాజ్ గురించి అందరికీ సుపరిచితమే.ఈయన నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే గత ఎన్నికలలో వైయస్సార్ సిపి పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ పార్టీకి మద్దతు తెలిపారు. ఈ విధంగా వైయస్సార్సీపి పార్టీకి మద్దతు తెలపడంతో ఈయనకు ఎస్విబిసి చైర్ పర్సన్ పదవి ఇచ్చారు.

అయితే ఈ పదవిలో కొనసాగుతుండగా ఒక ఆడియో రికార్డు కావడంతో ఈయన ఈ పదవి నుంచి వైదొలగిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఎస్విబీసీ చైర్ పర్సన్ పదవి నుంచి బయటకు వచ్చిన పృథ్వి రాజ్ తిరిగి ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ పలు సినిమా అవకాశాలను అందుకున్నారు. అయితే తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

రాజకీయాలలో మాట్లాడే వారికి అవకాశాలు ఉండవని నోరు లేని వారికి కూడా మంత్రి పదవులు ఇస్తున్నారు అంటూ ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర రాజకీయాల గురించి ఆయన ప్రస్తావించారు. ఇక ఈయన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను అయితే తనకు కరోనా వచ్చిన సమయంలో మరుసటి రోజు సూర్యోదయాన్ని చూస్తాన లేదా అని సందేహం కలిగింది. ఈ విధంగా తన ఆరోగ్యం బాగాలేకపోయినా నాకు ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి సహకారం కానీ మాట గాని అందలేదని, ఆ సమయంలో నన్ను పలకరించినది మాత్రం సినీ ప్రముఖులే అని పృథ్వీరాజ్ ఈ సందర్భంగా వెల్లడించారు.
తాను రాజకీయాలలో ఉన్నప్పటికీ మెగాస్టార్ కుటుంబం తనను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుందని పృథ్వీరాజ్ ఈ సందర్భంగా వెల్లడించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఆయన పేదల కోసం తన గళాన్ని విప్పుతారు.అయితే ఆయన ఏ విషయాన్ని అయినా చాలా గట్టిగా ప్రశ్నిస్తారు. ఆ విధంగా అడిగే విధానం వీళ్లకు నచ్చకపోవటం వల్ల తన పై వ్యక్తిగత దూషణలకు దిగుతారని పృథ్వీరాజ్ వెల్లడించారు.
పేపర్ లా వాడుకున్నారు…
ఇక గత ఎన్నికలలో భాగంగా పార్టీ ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్న పృద్వి రాజ్ కు అనంతరం పృధ్విరాజ్ అవసరం రాలేదా అని యాంకర్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ పార్టీ గెలిచిన తర్వాత తన అవసరం రాలేదని తనని ఒక టిష్యూ పేపర్ లా వాడుకొని వదిలేసారు. నా విషయంలో అలా జరిగిందని ఈయన తన ఆవేదన వెల్లడించారు.
































