వెంప కాశీ పుట్టినరోజు సందర్భంగా పంచనామా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్‌ను హార్దిక్ క్రియేషన్ చిత్ర యూనిట్ మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంప కాశీ గురించి వివి వినాయక్ మాట్లాడుతూ.. తాను ఎన్నోసార్లు సినిమాల్లో నటించమని అడిగానని.. కానీ అతడు చేయలేదని.. అలాంటిది ఈ వ్యక్తి పంచనామా అనే సినిమాలో చేశాడని విని షాక్ అయ్యానన్నారు వివి వినాయక్.

అసలు ఈ సినిమా ఎందుకు చెయ్యవలిసి వచ్చింది. క్యారెక్టర్ ఏంటి.. ఆ డైరెక్టర్ చెప్పిన విధానం ఏంటి.. ఎలా ఒప్పించారని చాలా ఆశ్చర్యం అనిపించిందన్నారు. కనుక ఆ క్యారెక్టర్ విన్న తరువాత అప్పుడు అనిపించింది ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని కోరుకుంటూ.. డైరెక్టర్ సిగటాపు రమేష్ నాయుడుకి నా మనస్పూర్తిగా దీవెనలు తెలుపుతున్నాను అని అన్నారు. ఫస్ట్ లుక్ లోనే పోస్టర్ పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుందని… సినిమాని ఎంత బాగా కసిగా తీశారో పోస్టర్ లోనే చెబుతోందన్నారు. పంచనామ చిత్ర యూనిట్ సభ్యులందరికీ నా అభినందనలు అంటూ చెప్పాడు వివి వినాయక్.

పంచనామ చిత్ర డైరెక్టర్ సిగటాపు రమేష్ నాయుడు మాట్లాడుతూ.. వి.వి వినాయక్ గారు చాలా బిజీగా ఉన్నా కూడా ఆయన చేతులు మీదగా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ లాంచ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఆయనని నేను బ్రహ్మ అని పిలుచుకుంటాను. నాకు ఇష్టమైన డైరెక్టర్స్ లో వి.వి వినాయక్ గారు ఒకరు. ఆయన ఇచ్చిన దీవెనలు నాలో మరింత పాజిటివ్ ఎనర్జీని నింపాయి. వి.వి వినాయక్ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు.
త్రిపుర నిమ్మగడ్డ, వెంప కాశీ, సంజీవ జాదవ్, ముక్కు అవినాష్ ఈ సినిమాల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సిగటాపు రమేష్ నాయుడు దర్శకత్వం వహిస్తుండగా.. గద్దె శివకృష్ణ, వెలగ రాము ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాకు ఛాయా గ్రహణం జి. పవన్ ఉండగా.. సంగీత దర్శకుడిగా.. ప్రదీప్ చంద్ర చేస్తున్నాడు.


































