తెలుగు సినీ ప్రేక్షకులకు కమెడియన్ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పృథ్వి రాజ్ ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నటుడిగా, కమెడియన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు.ఇతను థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే ఒక డైలాగుతో ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యారు. ఇతను ఖడ్గం సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. ఇదిలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు పృథ్వీరాజ్..

ప్రభాకర్ రెడ్డి గారు తన కెరియర్ లో మంచి చేశారో, లేక చెడు చేశారో తెలియదు కానీ ఒక థండరింగ్ ఇచ్చారని పృథ్వీరాజ్ తెలిపారు. అనంతరం గండిపేట రహస్యం సినిమా గురించి పలు విషయాలను పంచుకున్నారు. ఇందులో మొదట పృథ్వీరాజ్ అశోకగజపతి రాజు రోల్ లో నటించాల్సి ఉండగా, తాను పెద్ద ఆయనలా ఉన్నాను అని చెప్పి వేషం వేయించారు అని పృథ్వి రాజ్ తెలిపారు.

అలాగే ఆ పాత్ర వివాదం అవుతుందని తాను ఎప్పుడూ అనుకోలేదని పృథ్వీరాజ్ వెల్లడించారు.
ఆ సమయంలో పృథ్విరాజ్ అయ్యప్ప మాలలో ఉన్నాడట. అప్పుడు పృథ్వీరాజ్, ప్రభాకర్ రెడ్డి కలిసి ఒక థియేటర్ కు వెళ్లగా అక్కడ జనాలు పరిగెత్తుకుంటూ కొట్టడానికి వచ్చారని ఆ సమయంలో హరికృష్ణ కారు ఎక్కాలని చెప్పి తన కారులో తీసుకెళ్లారని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు.
అలా హరికృష్ణ లేకపోతే తనని సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు కొట్టేవారని చెప్పకనే చెప్పేశారు. ఆ సినిమా వల్ల పృథ్వి రాజ్ నాలుగేళ్లు కష్టపడ్డారట. ఈ నేపథ్యంలోనే పృధ్విరాజ్ ముక్కు చెవులు కోస్తామని కూడా బెదిరించారట. ఆ తరువాత ఒకసారి సీనియన్ ఎన్టీఅర్ ని కలిసి కాళ్ళమీద పడిపోయారట.. కానీ సీనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆ పాత్రను సీరియస్ గా తీసుకోకపోగా, తాను బ్రహ్మాండంగా పైకి వస్తానని ఎన్టీఆర్ ఆశీర్వదించారని పృథ్వీ రాజ్ అని చెప్పుకొచ్చారు.
































