దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేయడంతో రోజురోజుకు కేసులు అధికమవుతున్నాయి. ఈ క్రమంలోనే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం అధికారులు భద్రతా చర్యలు తీసుకోవడం, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం, అదేవిధంగా కరోనా కట్టడి కోసం ఎన్నో ఔషధాలు మార్కెట్లోకి వచ్చినప్పటికీ వైరస్ మాత్రం అదుపు కాలేదు. మరికొందరు పాత పద్ధతి కి వెళ్లి కరోనా కట్టడి కోసం ఆయుర్వేద మందులను ఉపయోగిస్తున్నప్పటికీ వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు.

తాజాగా ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం జిల్లాలోని ఓ వ్యక్తి కరోనా వైరస్ ను కట్టడి చేయాలంటే కేవలం న్యూమరాలజీ ద్వారా మాత్రమే ఈ వైరస్ ను కట్టడి చేయవచ్చు అని చెప్పడంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరోనాకు వ్యాక్సిన్ తో పనిలేకుండా, కేవలం స్పెల్లింగ్ మారిస్తే చాలు కరోనా వైరస్ ఈ ప్రపంచం వదిలిపోతుందని తెలిపారు. ప్రస్తుతం కరోనా స్పెల్లింగ్ CORONA కు బదులు CORONAA అని, కోవిడ్-19 స్పెల్లింగ్‌ను COVID-19కు బదులు COVVIYD-19గా మార్చాలని ఎస్వీ ఆనందరావు అనే వ్యక్తి అనంతపురంలో జ్యుడిషియల్ డిపార్ట్‌మెంట్లో స్టెనోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఆయన తెలిపారు.

తాజాగా ఆయనకు సంబంధించిన ఓ ఫ్లెక్సీ అనంతపురం లో ప్రత్యక్షం కావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపై కరోనా స్పెల్లింగ్ పైన చెప్పిన విధంగా మార్చి రాస్తే కరోనా ఈ ప్రపంచం వదిలి పారిపోతుందని తెలియజేశారు. ఈయనకు సంబంధించిన ఫ్లెక్సీని పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే సినీ నటుడు నందు కూడా ఫోటోని షేర్ చేస్తూ మీరు నిజంగా జాతిరత్నం సార్ అంటూ కామెంట్ చేశారు.

ఈ పోస్టు చూసిన నెటిజన్లు ఇలాంటివారు ఉండబట్టే వైరస్ వ్యాప్తి ఈ విధంగా ఉందంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కరోనా కట్టడి చేయాలంటే స్పెల్లింగులు కాదు మార్చాల్సింది, మనుషులు మారాలి అందరూ భౌతిక దూరం పాటిస్తూ వాక్సిన్ తీసుకున్నప్పుడే ఈ వైరస్ ఈ ప్రపంచం నుంచి దూరమవుతుందని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here