మానవ శరీరంలో ప్రతీ ఒక్క అవయవం ఆరోగ్యకరంగా ఉంటేనే మానవుడు బతుకుతాడు. లేదంటే.. చావు అంచుల్లోకి వెళ్లాల్సిందే. తర్వాత ఆసుపత్రుల వెంట తిరిగినా ఉపయోగం లేకుండా ఉంటుంది. అయితే కరోనా మహమ్మారి ఎక్కువగా ఊపిరితిత్తులపై ఎఫెక్ట్ చూపిస్తుంటుందన్న విషయం తెలిసిందే.

అయితే దానిని అనారోగ్యానికి గురి కాకుండా మనం ఏం చేయాలి.. ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. ముఖ్యంగా పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం అనేది చాలా అవసరం. అందులో ముఖ్యంగా బెల్లం తీసుకోవాలి. ఎందుకంటే.. ఆయుర్వేదంలో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు బెల్లం ఎక్కువగా వినియోగిస్తారు.
ఇది ఎక్కువగా శ్వాసకోశ సమస్యలను నివారించడంలో ఉపయోగపడుతుంది. రెండోది చేప. చేపలు ప్రతీ ఒక్కరూ తినొచ్చు. దీనిలో ఒమేగా 3 కొవ్వుఆమ్లాలు ఉంటాయి. ఇది ఊపిరితిత్తులను శుభ్రం చేయడంలో సహాయపడతాయి. ఆపిల్ పండు తీసుకోవడం కూడా చాలామంచిది. ఆపిల్ తినడం వల్ల ఊపిరితిత్తులు చేసే పని సామార్థ్యం అధికంగా పెరుగుతుంది.
ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుంది. మరో పండు బీట్ రూట్. ఇది ఎక్కువగా రక్తం పెరగడానికి.. రక్తహీనత అధికంగా ఉండే వారు తీసుకుంటారు. వాటితో పాటు వీటిని తీసుకుంటే.. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇక చివరకు భారతీయ వంటకాల్లో విరివిగా ఉపయోగించే వెల్లులి. దీనిలో అల్లిసిన్ ఉంటుంది. దీని వల్ల ఉబ్బసం, బ్రాంకైటీస్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది.































