నితిన్.. ‘జయం’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తేజ దర్శకత్వంలో 2003లో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ అయింది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న నితిన్ మధ్యలో వరుస ప్లాపులతో కెరీర్ పరంగా తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. .

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఆ తర్వాత విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇష్క్’ సినిమాతో తిరిగి ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ప్రతీది హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇటీవల భీష్మ, రంగదే, మ్యాస్ట్రో వంటి సినిమాలతో మరో సారి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడు. ఇక అతడి ఫ్యామిలీ విషయానికి వస్తే.. అతడి ఫాదర్ సుధారకర్ రెడ్డి నైజాం ఏరియాలో టాప్ డిస్ట్రిబ్యూటర్ గా పని చేస్తున్నాడు.
తల్లి పేరు విజయలక్ష్మి, నితిన్‌కు నిఖితారెడ్డి అనే అక్క కూడా ఉంది. నితిన్ చదువు అంతా హైదరాబాద్ లో కొనసాగింది. ఇదంతా ఇలా ఉండగా.. నితిన్ ఆస్తుల విషయానికి వస్తే ఒక్కో సినిమాకు నితిన్ రు. 6 నుంచి రు. 7 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. రు. 50 లక్షల జాగ్వార్ కారు నితిన్ వాడుతున్నాడు. అలాగే రు. 75 లక్షల బీఎంయూయూ ఎస్స్ 5 కారు కూడా ఇటీవలే కొనుగోలు చేశాడు. ఇక 1.20 కోట్ల పోర్షే కయెన్, హోండా సీ ఆర్ వీ, ఇన్నోవా క్రిస్టా, వోక్స్ వేగన్ పాసట్ కూడా నితిన్‌కు ఉంది.
అతడు రూ. 16.90 లక్షల విలువ చేసే బైక్ ను వాడుతున్నాడు. జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ టెన్‌లో కోట్లు విలువ చేసే సొంత ఇళ్లు కూడా ఉంది. ఇవి కాక తండ్రి డిస్ట్రిబ్యూషన్‌తో పాటు ఇతర వ్యాపారాలు కూడా నితిన్‌కు ఉన్నాయి. ఇక నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్‌లో పలు సినిమాలు కూడా నిర్మించాడు. అక్కినేని హీరో అఖిల్‌ను ‘అఖిల్’ సినిమాతో నితిన్ వెండితెరకు పరిచయం చేశాడు.































