ప్రస్తుతం ఉన్న ఉరుకులు పరుగుల కాలంలో ప్రతి ఒక్కరు వారి ఆరోగ్యంపై దృష్టి సారించడం మర్చిపోతున్నారు. ఈ క్రమంలోనే అధిక శరీర బరువు పెరిగి ఊబకాయంతో బాధపడుతూ ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ఈ క్రమంలోనే చాలామంది ఈ ఊబకాయం సమస్య నుంచి ఉపశమనం పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ విధంగా అధిక శరీర బరువు తగ్గటానికి కేవలం శరీర వ్యాయామాలు చేయడమే కాకుండా మన ఆహార విషయంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఊబకాయంతో బాధపడేవారు వారి ఆహారంలో భాగంగా రాగులను తప్పనిసరిగా జోడించాలి.మన ఆహారంలో రాగులను నిత్యం తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఇక్కడ తెలుసుకుందాం…

రాగులలో సున్నా శాతం కొలెస్ట్రాల్, సోడియం ఉన్నాయి. ఏడు శాతం మాత్రమే కొవ్వులను కలిగి ఉన్నాయి. రాగులలో కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.ఈ క్రమంలోనే రాగులలో కాల్షియం అధికభాగం ఉండటం వల్ల ఆహారంలో భాగంగా చేసుకోవడంతో ఎముకలకు ఎంతో బలాన్ని చేకూరుస్తాయి.
రాగులలో కొవ్వు శాతం సోడియం శాతం పూర్తిగా తక్కువగా ఉండటం వల్ల ఇవి గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.ఐరన్ మెగ్నీషియం ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా లభించడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా, రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరిచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అదేవిధంగా రాగులలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం చేత కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా తరచూ ఆకలి వేయకుండా మన శరీర బరువును తగ్గించుకోవడానికి పూర్తిస్థాయిలో తోడ్పడుతుంది.
ముఖ్యంగా మధుమేహ వ్యాధితో బాధపడేవారికి రాగులు ఒక మంచి వరమని చెప్పవచ్చు. డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారికి ఆహారంలో భాగంగా రాగులను చేర్చడం వల్ల వారి కికార్బోహైడ్రేట్ల శాతం తక్కువగా అంది రక్తంలోని చక్కెర స్థాయిలను నిలకడగా ఉండడానికి దోహదపడుతుంది.ఎన్నో పోషకాలు కలిగినటువంటి రాగులతో వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకోవడం వల్ల ఈ విధమైనటువంటి ఆరోగ్యప్రయోజనాలను పొందడమే కాకుండా ఊబకాయ సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు.




























