సాధారణంగా చాలా మంది క్యాబేజి తినడానికి ఇష్టపడరు. కానీ క్యాబేజీ నుంచి తయారు చేసిన గోబీ వంటి ఫాస్ట్ ఫుడ్డును తినడానికి ఎంతో మక్కువ చూపుతుంటారు. ఈ క్యాబేజీని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.క్యాబేజీలో లభించే అనేక పోషకాలు మన శరీరానికి అందడం వల్ల ఎన్నో రకాల వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుందని చెప్పవచ్చు. అయితే క్యాబేజీ తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

క్యాబేజీ లో అధిక శాతం ఫైబర్, విటమిన్లు, ఆంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. క్యాబేజీని తయారు చేసుకునేటప్పుడు ఎక్కువగా ఉడికించకూడదు. ఆ విధంగా ఉడికించడం వల్ల అందులో ఉన్నటువంటి పోషకాలన్నింటిని కోల్పోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇందులో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.అదేవిధంగా విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల మన శరీరానికి కావలసినంత రోగ నిరోధక శక్తిని అందించడంలో క్యాబేజీ ప్రముఖ పాత్ర వహిస్తుంది.

ఇందులో ఉన్నటువంటి యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు మన శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలను నిరోధించడానికి దోహదపడతాయి. క్యాబేజీలో ఉన్నటువంటి బీటాకెరోటిన్ కంటిశుక్లం నివారించి కంటిచూపును మెరుగుపరుస్తుంది. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఒక కప్పు క్యాబేజీ ఉడికించిన రసం తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గడానికి సహకరిస్తుంది. ఇందులో ఉన్నటువంటి క్యాల్షియం ఎముకల పటుత్వానికి, దంతాలు దృఢంగా ఉండటానికి ఉపయోగపడతాయి. ప్రకాశవంతంగా, కాంతివంతమైన చర్మం పొందాలనుకుంటే ఒక అరగంట పాటు క్యాబేజీని నానబెట్టిన నీటితో మొహం కడుక్కోవడం వల్ల కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here