Ilayaraja : సినిమా సంగీతం లో ఒక తరాన్ని ఏలిన సంగీతం దర్శకుడు ఇళయరాజా. ఎనభై తొంభై దశకాల్లో తమిళ తెలుగు ఏ భాషా సినిమా అయిన మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం ఇళయరాజానే. అంతలా ఆయన పాటలను అభిమానించే ప్రేక్షకులు ఉన్నారు. కొన్ని వేల పాటలకు స్వరాలు కూర్చిన ఇళయరాజా ఇటీవల రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ ను ప్రధాని మోడీతో పోల్చి విమర్శల పాలయ్యారు.

దేశ వ్యాప్తంగా ఈ కామెంట్స్ బాగా చర్చకు దారితీశాయి ఇక ఈ తరుణంలో చెన్నై జీఎస్టీ అధికారులు ఇళయరాజాకు జరిమానా విధించడం చర్చకు దారితీసింది.పన్ను చెల్లింపులకు సంబంధించి ఇళయరాజాకు జీఎస్టీ అధికారులు మూడు సార్లు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు ఇళయరాజా నుంచి స్పందన లేకపోవడంతో చెన్నై జీఎస్టీ అధికారులు తాజాగా నోటీసును జారీ చేసింది.
ఇళయరాజాకు 1.8 కోట్ల పన్ను ….
మంగళవారం ఇళయరాజాకు నోటీసులు వచ్చాయి. ఈ మొత్తానికి వడ్డీ, జరిమానా అధికమని కూడా ఆ నోటీసుల్లో జీఎస్టీ తెలిపింది. ఈ మేరకు ఈ నెల 20వ తేదీన ఈ నోటీసులు జారీ అయ్యాయి. నోటీసు ప్రకారం 1.8 కోట్ల మేర పన్ను ఇళయరాజా కట్టాలి . ఇప్పటికే మూడు సార్లు జారీ చేసిన నోటీసులకు స్పందన లేకపోవడంతో జరిమానా విధించారు.































