ఫిట్‌నెస్ అనేది ప్రతీ ఒక్కరికీ అవసరం. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏ పని చేయాలన్నా.. ఉత్సాహంతో చేస్తాడు. అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. రోజూ వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరమే.

అయితే.. ఫిట్‌నెస్‌గా ఉండటం అనేది సినిమాలో చేసే వాళ్లకు చాలా అవసరం. అది హీరోహీరోయిన్లకు మరీ ముఖ్యం. ఇలా ఆ తారలు పడే బాధలు అంతా ఇంతా కాదు. రోజంతా జిమ్ లోనే గడుపుతూ.. వాళ్ల క్యారెక్టర్ కు కావాల్సిని విధంగా తయారు అవుతారు. వర్కవుట్ చేయడంలోనే ఎక్కువగా సమయం గడుపుతారు. ఇటీవల అనుష్కశెట్టి కూడా లావుతగ్గే పనిలో పడ్డారు.
ఆమె చేసే క్యారెక్టర్ కోసం ఇలా కష్టపడుతోంది. గోవా సొగసరి ఇలియానా కూడా అంతే.. ఫిట్ గా ఉండటం కోసం వివిధ రకాల ప్రయాత్నాలు చేస్తున్నారు. అయితే ఇటీవల వర్కవుట్ అయిపోయిన తర్వాత ఆమె ఎమోషనల్ అయ్యారు. జిమ్ లో ఆమెకు వర్కవుట్ చేయించేచి ట్రైనర్ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.

ఇప్పుడు చేతులు నీ దగ్గర పెట్టుకుని నీ బాడి గురించి నువ్ ఆలోచించుకో.. నీ కోసం నీ శరీరం ఎంత కష్టపడుతోందో ఫీల్ అవ్వు అని ట్రైనర్ చెప్పాడు. అతడు చెప్పిన ప్రకారం.. నా బాడీని ఆలింగనం చేసుకోగానే నా బాడీ గురించి నేను ఆలోచించుకున్నాక ఎంతో సంతోషం వేసింది. మీరు కూడా ఓ సారి అలా చూసుకోండి అని ఇలియానా చెప్పుకొచ్చింది.































