Ileana: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. బాబు ఎంత క్యూట్ గా ఉన్నారో చూసారా?

0
39

Ileana: ఇలియానా పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ఈ మధ్య కాలంలో సినిమా అవకాశాలను కోల్పోవడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఇలా సోషల్ మీడియా వేదికగా అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే ఇలియానా తాను తల్లి కాబోతున్నాననే విషయాన్ని కూడా తెలియజేశారు.

ఇలా ఈమె తల్లి కాబోతున్నాననే విషయాన్ని తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇలియానా పెళ్లి కాకుండానే తల్లి కావడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక ఇలియానా ఎప్పటికప్పుడు తన ప్రేగ్నెన్సీకి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈమె తాజాగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది.

ఈమె ఆగస్టు 1వ తేదీ బిడ్డకు జన్మనివ్వగా ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా తెలియజేశారు.ఆగస్టు ఒకటో తేదీ తన కుమారుడు జన్మించారు అంటూ తన కుమారుడి ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన నేటిజన్స్ అందరూ కూడా బాబు చాలా క్యూట్ గా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.


Ileana: మాటల్లో చెప్పలేని సంతోషం…

ఇక ఇలియానా తన బిడ్డ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడమే కాకుండా తన కొడుకుకి కోపోనిక్స్ డోలన్ అని పేరు కూడా పెట్టారు.ఇలా తన కొడుకు ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి ఇలియానా తన కుమారుడుని ఈ ప్రపంచానికి పరిచయం చేసినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను అని ఎమోషనల్ పోస్ట్ చేశారు.