Imandi Ramarao : అలనాటి అందాల తారామణి బి సరోజ గారి గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు అనేక విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆమె గురించి చాలా మందికి తెలియని విషయాలను చెప్పారు. బి సరోజ గారి అసలు పేరు బెంగుళూరు సరోజ దేవి, మైసూర్ లో జన్మించిన ఆమె కన్నడ సినిమాతో తన నటనా జీవితాన్ని మొదలుపెట్టారు. ఇక ఆ తరువాత తమిళ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా ఎదిగారు. తమిళంలో ఎక్కువగా ఎంజీఆర్ తో సినిమాలను చేసిన సరోజ గారు ఆయనతో మంచి అనుబంధం కలిగి ఉండేవారంటూ ఇమంది గారు సరోజ దేవి గురించి చెప్పారు.

సావిత్రి గారితో గొడవ ఆమె జీవితంలో మచ్చ…
సరోజ దేవి గారు హీరోయిన్ గా మంచి అవకాశాలను అందుకుని అగ్ర స్థానంలో కొనసాగుతున్న రోజుల్లో సావిత్రి గారితో పోటీ పడేవారని ఇమంది గారు గుర్తు చేసుకున్నారు. అయితే సావిత్రి గారి మీద ఇతరులకు చెడుగా చెప్పినా ఆమె పెద్దగా పట్టించుకోలేదని, ఇక సావిత్రి గారు బాగా మధ్యానికి బానిస గా మారక తన దగ్గర ఉంటే ఖర్చు పెట్టేస్తాననే భయంతో ఒక కోట్లు విలువ చేసే ఒక నగను తాగినపుడు సరోజ దేవి గారికి ఇస్తే మళ్ళీ అడిగితే ఇవ్వలేదని, ఇలా నా మీద నిందలు వేస్తే మాట్లాడానని గొడవ పడిందట.

అయితే సావిత్రి గారు తాగినా నాకు గుర్తుంది నీకు ఇచ్చాను అంటూ ఎంత వాదించినా ఫలితం లేకపోయిందట. ఇక ఈ విషయాన్ని ఇమంది గారు చెప్పి ఈ సంఘటన నిజమో కాదో తెలియదు కానీ సరోజ దేవి గారి మీద మాత్రం మచ్చ పడింది అని చెప్పారు. ఇక సరోజ దేవి గారు చాలా గ్లామర్ గా ఉండేవారని, అప్పట్లో ప్రధాని జవహర్ లాల్ నెహ్రు గారు కూడా సరోజ దేవి గారి మీద మనసు పడ్డారని ఇమంది గారు గుర్తుచేసారు. చాలా సినిమాల్లో ఎంజీఆర్ తో కలిసి నటించిన సరోజ దేవి గారు ఆయన మీద అభిమానంతో కొడుకుకి ఎంజీఆర్ అని పేరు కూడా పెట్టుకున్నారంటూ ఇప్పటికీ చాలా ఆరోగ్యంగా ఉన్న సరోజినీ దేవి గారు పరిపూర్ణానమైన జీవితాన్ని చూస్తున్నారని చెప్పారు.































