మన హిందూ సాంప్రదాయాల ప్రకారం వివాహంలో ఎంతో ముఖ్యమైన, పవిత్రమైనదిగా భావించేది మంగళసూత్రం. ఈ మంగళ సూత్రాన్ని కొన్నిచోట్ల తాళి, పుస్తే, తాళిబొట్టు అనే పేర్లతో పిలుస్తుంటారు. మన ఆచార వ్యవహారాల ప్రకారం మంగళసూత్రం అనేది కేవలం పెళ్ళయిన స్త్రీల మెడలో మాత్రమే ఉంటుంది. పెళ్లిలో స్త్రీ మెడలో ఒకసారి మంగళసూత్రం పడిందంటే తన భర్త ఆయుష్షుతో ఉన్నంతకాలం ఆ స్త్రీ మెడలో తప్పనిసరిగా తాళి ఉండాలి. తాళి అనేది స్త్రీకి ఐదవతనం అని చెప్పవచ్చు. అయితే తాళి కట్టిన తర్వాత అందులో మహిళలు పగడాలు, ముత్యాలను ధరిస్తుంటారు. ఈ విధంగా ఆ పూసలను ధరించడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

సాధారణంగా వివాహ సమయంలో వరుడు వధువు మెడలో తాళిని కడతాడు. ఈ తాళి 108 సన్నని దారాల పోగులతో చేసే దానికి పసుపు అంటించడం వల్ల పసుపుతాడుగా భావిస్తారు. అదే విధంగా 11 దారాల పోగులతో తాళిని తయారు చేసే వధువు మెడలో కడతాడు. మంగళ సూత్రం అంటే శుభప్రదమైనది అని అర్థం. అదేవిధంగా పెళ్లి అనంతరం వధువు తాళిబొట్టుతో పాటు, అందులో ముత్యాలు పగడాలను కూడా ధరించడం మనం చూస్తుంటానము.
ఈ విధంగా ముత్యం పగడం ధరించడం వల్ల సూర్యుడి నుంచి వెలువడే కిరణాలు మన మాంగల్యంలో ఉన్న ఎరుపు రంగు (కుజుడు) తెలుపు రంగు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ శరీరంలోని అన్ని నాడులను ఉత్తేజపరుస్తుంది. అంతేకాకుండా ఆ రెండు గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను కూడా తొలగిస్తాయి. అందుకోసమే పెళ్ళయిన స్త్రీలు మంగళ సూత్రంతో పాటు ముత్యాలు, పగడాలను కూడా ధరిస్తారు.



























