Viral Video: సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని పెళ్లికి సంబంధించినవి కూడా ఉంటాయి. ఇలా ఇటీవల కొన్ని వెడ్డింగ్ వీడియోలు తెగ వైరల్ గా మారాయి. ఇలా పెళ్లి వీడియోల్లో డ్యాన్స్ లు, ప్రపోజల్స్ తో ఆశ్యర్యపోయే విధంగా వీడియోలు ఉంటే.. కొన్ని వీడియలో తెగ కామెడీగా ఉంటాయి.

అయితే ఇక్కడ చెప్పే ఓ వీడియోలో వరుడు చేసే పని మీరు చూస్తే నవ్వు ఆపుకోవడం కష్టమే. ఈ వధూవరులకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు.. లక్షల కొద్దివ్యూస్ ను సంపాదించుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. పెళ్లి వేడుకలో ఇటీవల ఫన్నీ సన్నివేశాలు చాలా జరుగుతున్నాయి. అక్కడ వధూవరులు చేసే అల్లరి.. వాళ్లు చేసే చిలిపి పనులు నవ్వులు తెప్పిస్తున్నాయి. అయితే వీళ్లు కావాలనే అలా చేస్తారా లేదా.. వారి అలవాటు అలానే ఉంటుందా అనేది అర్థం కాదు.
ఆమె పక్కకు చూసి ఆశ్చర్యపోయింది..
ఆ వీడియోల పెళ్లిమండపంలో వధువు, వరుడు పెళ్లికి సిద్ధంగా ఉంటారు. ఇక వరుడు తాళి కట్టే సమయం ఆసన్నమవుతోంది. ఈ లోపు పంతులు తమ మంత్రాలను పటిస్తూ ఉంటాడు. అయితే వరుడు ఏం పని చేస్తున్నాడో తెలుసా.. పక్కనే పెళ్లి కూతరును పెట్టకొని.. రసగుల్లాలను లాగిస్తూ కనిపించాడు. ఇది చూసిన వాళ్లు ఇదేం పని రా బాబు. పక్కన పెళ్లి కూతురు.. పెళ్లి పెట్టుకొని ఇదేం పని అంటూ అతడిపై గుసగుసలాడారు. ఇలా వరుడు చాలాసార్లు స్పూన్‌తో రసగుల్లా తినడం చేస్తూ ఉన్నాడు. వాటిని పెళ్లికూతురును తింటావా అని కూడా అడగలేదు. అస్సలు ఏం జరుగుతాందా అని ఆమె పక్కకు చూసి ఆశ్చర్యపోయింది. అక్కడే ఉన్న కొంతమంది ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం వైరల్ గా మారింది.





























