Crime News: ఈ మధ్యకాలంలో అతి చిన్న వయసులోనే యువత ప్రేమ పేరుతో తమ జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో ఇటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.పిచ్చుక దేవేంద్రకుమార్, కుసుమలక్ష్మి ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో 2021లో వివాహం చేసుకున్నారు.

వివాహం తర్వాత దంపతులిద్దరూ తల్లిదండ్రుల వద్దే ఉంటూ మూడు నెలలపాటు కాపురం చేశారు. తర్వాత కుటుంబంలో చిన్న చిన్న గొడవలు కారణంగా పెద్దమనుషుల సలహా మేరకు దేవేంద్ర కుమార్ దంపతులు పట్టణంలోని 12వ వార్డులోని అద్దె ఇంట్లో ఉంటున్నారు.

వేరు కాపురం పెట్టిన కూడా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో గురువారం ఉదయం కూడా ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కుసుమలక్ష్మి ఫోన్ చేసి తన తల్లికి చెప్పి బాధ పడింది. కుసుమ లక్ష్మి తల్లి తన కూతురిని ఓదార్చి తాను వస్తున్నానని.. గొడవ పడొద్దని కూతురితో చెప్పింది. కుసుమ లక్ష్మి తల్లి ఇంటినుండి బయలుదేరి కూతురు ఇంటికి వచ్చేలోపు తన కూతురు ఇంట్లో దూలానికి వేలాడుతూ శవమై కనిపించింది. వెంటనే ఆమె చుట్టుపక్కల వారి సహాయంతో కూతురిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించడంతో ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు ఈ సంఘటన గురించి విచారణ చేపట్టారు.
అదనపు కట్నం కోసం వేధింపులు…
ఈ క్రమంలో పోలీసులు బాధితురాలి తల్లిని విచారించగా.. పెళ్లి అయిన సమయం నుండి తన కుమార్తె అత్త ,మొగుడు ,బావ ,ఆడపడుచు నిత్యం తన కూతురిని అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేసేవారని ఆమె చెప్పుకొచ్చింది. వారి వేధింపులు భరించలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన కుమార్తె 5 వారాల గర్భిణీ అని, బుధవారం ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించి తీసుకువచ్చారని ఆమె వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.































