ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వివిధ రకాల వీడియోలు వైరల్ గా మారాయి. వాటితో కొంతమంది పాపులారిటీ తెచ్చుకోగా.. మరికొంత మంది తమ ట్యాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆ అమ్మాయిలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇంతకు అందులో ఏముందంటే.. నడి రోడ్డుపై ఎనిమిది మంది యువతులు తెగ కొట్టుకుంటున్న ఘటన. హర్యానా లోని రోహ్ తక్ లో చోటుచేసుకుంది.

వారు అంతక ముందు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ.. ఓ కోచింగ్ సెంటర్ కు ఎదురుగా ఉన్న రోడ్డుపై ఒకరినొకరు వాగ్వాదం చేసుకుంటూ.. నడి రోడ్డుపు బీభత్సం చేశారు. ఎవరికివారు ఇష్టం వచ్చినట్లు తన్నుకున్నారు. అక్కడ ఈ సీన్ జరుగుతండగా.. చుట్టూ వచ్చి జనాలు నిల్చొని చూస్తున్నారే తప్ప ఒక్కరు కూడా దగ్గరకు వచ్చి ఆపే ప్రయత్నం చేయలేదు.
పైగా ఆక్కడ ఏదో సర్కస్ జరుగుతున్నట్లు తమ మొబైల్ ఫొన్లలో వీడియోలు, ఫొటోలు తీస్తూ ఉండిపోయారు. అక్కడ తీసిన వీడియోను అందులో ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. తెగ వైరల్ అయిపోయింది. ఇది కాస్త పోలీసుల దృష్టికి వెళ్లగా ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ గొడవలో కొంతమందికి గాయాలు అయ్యాయి. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ వీరేంద్ర కుమార్ కు వివరణ అడగ్గా.. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఒలంపిక్స్ కు వెళ్తే.. రెజ్లింగ్ లో ఎక్కువ పతకాలు వచ్చేవని.. లేడీ రెజ్లర్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరొకరు వీళ్లను ఎవరు పెళ్లి చేసుకుంటారో తెలియదు కానీ.. వాడి జీవితం నాశనం అయిపోయినట్లే అంటూ మరొకరు ఫన్నీగా కామెంట్ చేశాడు.






























