కొత్తఏడాది ప్రారంభమై మూడు రోజులైంది. కొత్త ఏడాదిలో కొన్ని పనులను నిర్ణీత తేదీలోగా పూర్తి చేయాలి. ఆ తేదీల్లోగా పూర్తి చేయలేకపోతే మాత్రం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. గతేడాది విజృంభించిన కరోనా మహమ్మారి వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఫైనాన్షియల్ డెడ్ లైన్స్ కు సంబంధించిన గడువులను పొడిగించింది. తేదీలను కచ్చితంగా గుర్తు పెట్టుకుంటే మాత్రమే కొత్తఏడాదిలో అనుకున్న పనులను అనుకున్న విధంగా పూర్తి చేయడం సాధ్యమవుతుంది.

2020 – 2021 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి డిసెంబర్ 31వ తేదీ చివరి తేదీగా ఉండగా కేంద్రం జనవరి 10వ తేదీ వరకు ఐటీఆర్ లను దాఖలు చేయడానికి అనుమతిస్తోంది. ఇప్పటివరకు ఐటీఆర్ లను దాఖలు చేయని వాళ్లు వీలైనంత త్వరగా వాటిని దాఖలు చేస్తే మంచిది. ట్యాక్స్ అడిట్ రిపోర్ట్ లను సమర్పించేవారికి వాటిని సమర్పించడానికి జనవరి 15వ తేదీ చివరి తేదీగా ఉంది.
వివాద్ సే విశ్వాస్ పథకానికి డిక్లరేషన్ ఇచ్చేవాళ్లు ఈ నెల 31వ తేదీలోగా డిక్లరేషన్ ను ఇవ్వాల్సి ఉంటుంది. అడిట్ చేయాల్సిన అవసరం లేని వాటికి ఈ నెల 10తో ఐటీఆర్ దాఖలు గడువు ముగుస్తుండగా అడిట్ చేయాల్సిన అవసరం ఉన్నవారికి మాత్రం ఫిబ్రవరి 15వ తేదీ ఐటీఆర్ దాఖలుకు చివరి తేదీగా ఉంది. ప్రతి నెలా పెన్షన్ ను పొందేవారు ఫిబ్రవరి 28వ తేదీలోగా లైఫ్ సర్టిఫికెట్ ను పొందే అవకాశం ఉంటుంది.
అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్ కు మార్చి 15వ తేదీతో గడువు ముగుస్తుండగా ఆధార్ పాన్ లింకింగ్ కు మార్చి 31వ తేదీ చివరి తేదీగా ఉంది. కొత్త ఇంటి కొనుగోలుపై పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందడానికి జూన్ 30 చివరి తేదీగా ఉండగా 2020 – 2021 ఐటీఆర్ దాఖలు చేయడానికి జులై 31వ తేదీ చివరితేదీగా ఉంది.































