తెలంగాణలో తీవ్రం అవుతున్న కరోనా కేసుల సంఖ్య… వెయ్యికి చేరువలో…

0
235

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది… ప్రస్తుతం 1000 కి దగ్గరలో కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అనేక చర్యలు చేపడుతున్నా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంపై తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్కరోజే 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క జిహెచ్ఎంసి పరిధిలోనే 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా… గద్వాలలో 2, నిజామాబాద్ లో 3, ఆదిలాబాద్ లో 2, కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా సూర్యాపేటలో 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం అక్కడి ప్రజలను తీవ్రంగా భయపెడుతున్న విషయం.

కాగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కేసుల సంఖ్య 928కి చేరాయి. అలాగే డిశ్చార్ ఆయిన వారి సంఖ్య 194, కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య ఇప్పటివరకు 23 మంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here