ఒక్కో దేశంలో ఒక్కో తరహా శిక్షలు అమలులో ఉంటాయనే సంగతి తెలిసిందే. మన దేశంలో కొన్ని నేరాలకు తక్కువ శిక్ష పడితే అవే నేరాలకు వేరే దేశంలో ఎక్కువ శిక్ష పడుతుంది. తాజాగా ఒక ఘటనలో ముద్దు పెట్టుకున్నందుకు ఒక వ్యక్తికి ఏకంగా 7 నెలల జైలు శిక్ష పడింది. ఈ ఘటనతో విదేశీ చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో సులభంగానే అర్థమవుతుంది. యువతుల విషయంలో అనేక దేశాల్లో కఠిన చట్టాలను అమలు చేస్తున్నారు.

అత్యాచారాలు, లైంగిక వేధింపుల ఘటనలను సీరియస్ గా పరిగణిస్తున్నారు. కొన్ని దేశాల్లో అమ్మాయిల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తే బహిరంగ ఉరిశిక్షలు, యావజ్జీవ శిక్షలు సైతం అమలులో ఉన్నాయి. సింగపూర్ లో ఒక భారతీయుడు ఇష్టం లేకపోయినా బాలికను ముద్దు పెట్టకపోవడంతో అతనికి కోర్టు ఏడు నెలల జైలు శిక్ష విధించింది. రాజేష్ కన్నన్ అనే 26 సంవత్సరాల వయస్సు ఉన్న భారతీయుడు మైనర్ బాలికను ముద్దు పెట్టుకోవడంతో ఆ బాలిక రాజేష్ కన్నన్ పై ఫిర్యాదు చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే రాజేష్ కన్నన్ అనే వ్యక్తికి కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా వల్ల ఒక బాలిక పరిచయమైంది. ఆ తర్వాత పలు సందర్భాల్లో రాజేష్, బాలిక ఒకరినొకరు బయట కలిశారు. అలా ఒకసారి కలిసిన సమయంలో రాజేష్ బాలికను ముద్దు పెట్టుకున్నాడు. ఆ బాలిక కేసు పెట్టడంతో రాజేష్ ఉద్యోగం పోవడంతో పాటు పరువు కూడా పోయింది. ప్రస్తుతం అతను చేసిన తప్పుకు జైలు శిక్షను అనుభవిస్తున్నాడు.

తాను మూడు సంవత్సరాలుగా సింగపూర్ లో ఉంటున్నానని చేసిన పనికి తనకు సిగ్గుగా అనిపిస్తోందని.. ఈ నేరం మినహా తాను ఏ నేరం చేయలేదని కోర్టులో చెప్పగా న్యాయమూర్తి 7 నెలల జైలుశిక్ష విధించాడు. రాజేష్ కు ఇప్పటికే పెళ్లి కాగా ఒక పాప ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here