విద్యార్థులకు, నిరుద్యోగులకు రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఉచితంగా లేదా రాయితీతో రైలు ప్రయాణాలు చేసే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పిస్తోంది. రైల్వే వెబ్‌సైట్‌లో రైల్వే శాఖ ఉచిత ప్రయాణం, రాయితీ ప్రయాణానికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది. విద్యార్థులు సమీపంలోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ను సంప్రదించి ఉచిత రైలు ప్రయాణానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న తరగతి, ప్రయాణం చేసే ఊర్లను బట్టి ఉచిత ప్రయాణం ఆఫర్ అందుబాటులో ఉందో లేదో తెలుసుకునే అవకాశం ఉంటుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 75 శాతం వరకు టికెట్లపై రాయితీ పొందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎడ్యుకేషన్ టూర్ల కొరకు లేదా సొంత ఊర్లకు ప్రయాణం చేయడానికి విద్యార్థులు 75 శాతం డిస్కౌంట్ పొందవచ్చని సమాచారం.

జనరల్ కేటగిరీ విద్యార్థులు మాత్రం క్వార్టరీ సీజన్, నెలవరీ సీజన్ టికెట్, స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ లకు 50 శాతం డిస్కౌంట్ పొందవచ్చని తెలుస్తోంది. బాలురు ఇంటర్ సెకండియర్ వరకు, బాలికలు డిగ్రీ చదివే వరకు నెలవారీ సీజన్ టికెట్ ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు స్టడీ టూర్ కొరకు ఒకసారి 75 శాతం టికెట్లపై రాయితీని పొందే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

మెడికల్, ఇంజనీరింగ్ జాతీయ స్థాయి పరీక్షలను రాసే విద్యార్థులు సైతం సెకండ్ క్లాస్ టికెట్ కొనుగోలుపై 75 శాతం వరకు రాయితీని పొందే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, యూపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సైతం టికెట్ రేటుపై రాయితీని పొందవచ్చు. ఈ వివరాలపై అవగాహన ఉంటే రైలు ప్రయాణాలు చేసే వాళ్లకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here