Indrani Making Video: భారతదేశపు మొట్టమొదటి సూపర్ గర్ల్ గా తెరకెక్కబోతున్న ఇంద్రాని సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదు మరియు పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమాకు స్టీఫెన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అంతే కాకుండా ఈ సినిమా తో స్టీఫెన్ దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అలాగే ఈ సినిమాకు స్టాన్లీ సుమన్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించగా,యనియా భరద్వాజ్, కబీర్ దుహన్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

చిత్ర బృందం ఈ సినిమాను తెలుగు,తమిళం, హిందీ, కన్నడ మళయాలం భాషలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను రెండు సంవత్సరాలకు పైగా జరిపారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్, డిటైల్డ్ యాక్షన్ కొరియోగ్రఫీ, విజువలైజేషన్ తో VFX, ప్లానింగ్ తో సినిమాను మరింత వేగంగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో లీడ్ యాక్టర్స్ డెడికేషన్, రిస్క్ చూసి తాను నిజంగా ఆశ్చర్యపోయాను అని తెలిపాడు.

ఇక పార్ట్ వన్ మేకింగ్ వీడియోని విడుదల చేసిన దర్శకుడు, రాబోయే వీడియోలలో మరిన్ని అద్భుతమైన యాక్షన్ స్టంట్ లను విడుదల చేయనున్నట్లు తెలిపాడు. అలాగే ఈ సినిమా భారతీయ చరిత్రలో మహిళలు ఇంత పెద్ద స్థాయిలో రోప్ షాట్స్, ఎంతో రిస్క్ తో కూడిన కత్తులను ఉపయోగించి విన్యాసాలు చేసిన తొలి చిత్రం ఇంద్రాని అని చెప్పుకొచ్చాడు దర్శకుడు స్టీఫెన్.
బ్యానర్ : శ్రే మోషన్ పిక్చర్స్
రచన,దర్శకత్వం,నిర్మాత : స్టీపెన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : స్టాన్లీ సుమన్‌బాబు
మ్యూజిక్ : సాయి కార్తిక్
కో-డైరెక్టర్ : సాయి త్రివేది
డిఓపి : చరణ్ మాధవ నేని
ఎడిటర్ : ఎస్.బి ఉద్దవ్
యాక్షన్ డైరెక్టర్ : ప్రేమ్ సన్
ఆర్ట్ డైరెక్టర్ : రవి కుమార్ గుర్రం.































