డాక్టర్ రాజశేఖర్.. చాలా మంది డాక్టర్ కావాలి అనుకుని యాక్టర్ అయ్యాం అని చెప్తుంటారు. కానీ రాజశేఖర్ మాత్రం డాక్టర్ అయ్యాకే యాక్టర్ అయ్యాడు. తెలుగు సినిమా పరిశ్రమలో రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు చిరంజీవితో పోటా పోటీగా సినిమాలు చేశాడు. అద్భుత సినిమాల్లో చేసి అంత స్థాయిలో పేరు సంపాదించాడు. ఒకప్పుడు డాక్టర్ గా ఎంతో మంది రోగులకు ఆరోగ్యాన్ని చేకూర్చిన ఆయన.. ఆ తర్వాత సినిమాల వైపు మనసు మళ్లింది. దీంతో డాక్టర్ ఉద్యోగాన్ని పక్కన పెట్టి.. యాక్టర్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.

కొంతకాలం తర్వాత రాజశేఖర్.. వరుసగా ఫ్లాప్ సినిమాలు చేశాడు. హీరోగా నటించడమే కాదు.. నిర్మాణ రంగంలోకి కూడా రాజశేఖర్ అడుగు పెట్టాడు. ఈయన హీరోగా సొంత బ్యానర్ లోనే చాలా సినిమాలు చేశాడు. అయితే వీటిలో చాలా సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో ఆయనను ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఆ సమయంలో చెన్నైలో తనకున్నవిలువైన భవంతిని అమ్ముకున్నాడు. ఓవైపు డాక్టర్ ఉద్యోగం మానుకున్నాడు. మరోవైపు ఉన్న ఇళ్లును అమ్ముకున్నాడు. చాలా కాలం తను ఎన్నో ఇబ్బందులు పడ్డాడు.

ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి కాస్త విజయాలు అందుకున్నాడు. కష్టాల కడలి నుంచి కాస్త బయట పడ్డాడు. తన సెకెండ్ ఇన్నింగ్స్ తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గరుడవేగ అనే సినామ చేశాడు. ఈ సినిమా ఆయనకు ఓ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. దీంతో ఆయన మళ్లీ పుంజుకున్నాడు. ఈ సినిమా జోష్ తో మరిన్ని సినిమాలు చేసేందుకు సిద్ధం అయ్యాడు. అటు ఈయనతో పాటు ఈయన బిడ్డలు ఇద్దరు కూడా సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ఇప్పటికే తమ తొలి సినిమాలను కంప్లీట్ చేసుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ వైపు తండ్రి.. మరోవైపు కూతుర్లు ఇద్దరూ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.































