ఏ సినిమా స్టోరీ చెపుతుంటే పవన్ కళ్యాణ్ నిద్రపోయారో మీకు తెలుసా..?!

0
436

ఒకప్పటి సినిమా పరిస్థితులు ఇప్పటి సినిమా పరిస్థితులకు చాలా తేడా ఉందని చెప్పవచ్చు. జెమిని, ఏ.వి.ఎమ్, విజయ ప్రొడక్షన్స్ లో కథ వినడం కాదు అవకాశం దొరకడమే అదొక అదృష్టంగా భావించేవారు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, భార్గవ్ ఆర్ట్స్ లాంటి బ్యానర్ లో కూడా అంతే.. దాసరి నారాయణరావు కూడా ఏ సందర్భంలో హీరో హీరోయిన్లకు ఏనాడు కథ చెప్పిన దాఖలాలు లేవు. అలా ఆనాడు.. దర్శకుడు, బ్యానర్ ని నమ్ముకొని మాత్రమే నటీనటులు సినిమాలు చేసేవారు.

కానీ ఇప్పుడు సినిమా ట్రెండ్ పూర్తిగా మారింది. కథ హీరోని దృష్టిలో పెట్టుకొని రాయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్కో సందర్భంలో దర్శకుడు ఎంతో ప్రీ ప్లాన్డ్ గా కథ రాసుకున్నప్పటికీ అది హీరోకి నచ్చకపోవడంతో కథ పూర్తిగా క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో ఇప్పుడున్న స్టార్స్ లలో ఎవరు మినహాయింపు కాదు. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉన్న స్టోరీస్ కు మాత్రమే హీరోలు ఓకే చెబుతున్నారు.

ఒక్కోసారి ఆ సినిమా దర్శకుడికి లేదా రచయితకు చాలా పని భారం పడుతుంది. ఎందుకంటే ఇంకా మంచి క్వాలిటీతో లేదా మరొక వర్షన్ తో రా సినిమా చేద్దాం అనడంతో హీరో డేట్స్ ఎక్కడ మిస్ అవుతాయని పాపం దర్శక రచయితలు అనేక వర్షన్స్ రాసుకొని స్టార్ హీరో దగ్గరికి వెళ్తున్నారు. అలా పది పదిహేను వెర్షన్స్ రాసుకొని హీరో ని ఒప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఒక సందర్భంలో డైరెక్టర్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేద్దామనుకున్నాడు. ఆ క్రమంలో ఆయనకూ కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన ఐదు, పది, పదిహేను, ఇరవై నిమిషాలకి అలా మెల్లిగా పవన్ కళ్యాణ్ కూర్చున్న సోఫా లో నిద్ర పోయాడు. అది గమనించిన డైరెక్టర్ త్రివిక్రమ్ మెల్లిగా కుర్చీలోంచి లేచి వెళ్లిపోయారు.

అలా పద్మాలయ స్టూడియో ఆఫీస్ కి వెళ్లి మహేష్ బాబుకి కి త్రివిక్రమ్ కథ వినిపించాడు. ఆయన కథ విని ఏమీ చెప్పక లేచి లోపలికి వెళ్ళిపోయాడు. అసలు ఏం జరుగుతుంది అని త్రివిక్రమ్ కి అర్థం కాలేదు. మహేష్ బాబు చాలా సేపటికి వచ్చి ఓకే చెప్పడంతో ఆ కథతోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు అనే సినిమాను తీశారు. అలా 2005లో అతడు సినిమా విడుదలై సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here