సినీ చరిత్రలో కొన్ని జంటలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. మరికొన్ని జంటలు మధ్యలోనే ఆగిపోతాయి. అలా మధ్యలోనే ఆగిపోయిన జంటే నాగార్జున శోభన. వీరిద్దరి వెండితెర పరిచయంతో మొదలైన పరాజయ చిత్రాలతో బాక్స్ ఆఫీసు వద్ద వెనుతిరిగిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన విక్రమ్, నేటి సిద్ధార్థ, రక్షణ ఈ చిత్రాల్లో నాగార్జున శోభన ఇద్దరూ కలిసి నటించారు.

నాగార్జున, శోభన ఇద్దరు కూడా బాలనటులుగానే వెండితెరకు పరిచయమయ్యారు. 1972 బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన శోభన ఆ తర్వాత కాలంలో తమిళం లో ”ఏప్రిల్ 18′ అనే చిత్రంలో మొదటిసారిగా హీరోయిన్ గా నటించారు.

ఆ తర్వాత మలయాళం కన్నడ తెలుగు వంటి అనేక భాషల్లో నటించారు. ఆమె చక్కటి నటనను కనబరిచి నందుకు రెండు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. స్వతహాగా భరతనాట్యం వచ్చి ఉండడంతో ఆమె జాతీయ స్థాయిలో నృత్య కారిణిగా పేరు తెచ్చుకున్నారు. 1982 భక్త ధ్రువ మార్కండేయ చిత్రంలో సునితిదేవి పాత్రలో ఆమె తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత మరణ శాసనం, విజృంభన, త్రిమూర్తులు అభినందన, ముద్దుల మనవడు, నారీ నారీ నడుమ మురారి, రుద్రవీణ, అల్లుడుగారు, రౌడీ అల్లుడు, రౌడీ గారి పెళ్ళాం, ఏప్రిల్ 1 విడుదల, రెండిళ్ళ పూజారి, మువ్వగోపాలుడు, కోకిల, అప్పుల అప్పారావు, అల్లుడు దిద్దిన కాపురం, కన్నయ్య కిట్టయ్య లాంటి చిత్రాల్లో శోభన నటించారు.

ఆమె నటించిన తెలుగు చిత్రాలు అన్నింటిలో అభినందన చిత్రం శోభనకి ఎంతగానో పేరు తీసుకు వచ్చింది. 1988, అశోక్ కుమార్ దర్శకత్వంలో అభినందన చిత్రం విడుదల అయ్యింది. ఈ చిత్రంలో కార్తీక్, శోభన హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలోని పాటలు అన్ని సూపర్ డూపర్ హిట్ కావడం జరిగింది. ఈ సినిమా విజయంతో శోభనకు తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. అయితే 1986 అన్నపూర్ణ బ్యానర్, వి.మధుసూధనరావు దర్శకత్వంలో ‘విక్రమ్’ సినిమా విడుదలయ్యింది. ఈ చిత్రంలో నాగార్జున శోభన హీరో హీరోయిన్లుగా నటించారు. నాగార్జున,శోభన కలిసి నటించిన మిగతా చిత్రాలతో పోలిస్తే ‘విక్రమ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. కలెక్టర్ గారి అబ్బాయి, ఆఖరి పోరాటం, గీతాంజలి, శివ చిత్రాల విజయాలతో నాగార్జున సినీ జైత్రయాత్రలో మన్మధుడు గా తన ప్రస్థానం కొనసాగిస్తున్నారు.































